తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టెస్ట్ ఛాంపియన్​షిప్..​ ప్రపంచకప్​ లాంటిది' - ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్

ఒక టెస్ట్​ ప్లేయర్​గా ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్ తనకు ప్రపంచకప్​ లాంటిదని వెల్లడించాడు టీమ్​ఇండియా బౌలర్​ ఉమేష్ యాదవ్. జట్టు విజయాలలో ఫాస్ట్​ బౌలర్ల ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి మంచి ప్రదర్శన చేయాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ​

umesh yaadav, team india bowler
ఉమేష్ యాదవ్, టీమ్ఇండియా బౌలర్

By

Published : May 21, 2021, 4:00 PM IST

ఇంగ్లాండ్ వేదికగా న్యూజిలాండ్​తో జరగనున్న ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్ (డబ్ల్యూటీసీ)​పై స్పందించాడు భారత ఫాస్ట్​ బౌలర్ ఉమేష్ యాదవ్. ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్​కు ముందు తన ప్రాక్టీస్​ గురించి వివరించాడు. జట్టు విజయాలలో ఇటీవల ఫాస్ట్​ బౌలర్ల ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.

వరల్డ్​ కప్​ లాంటిది..

"ఒక టెస్ట్​ ప్లేయర్​గా నాకు డబ్ల్యూటీసీ.. ప్రపంచకప్​తో సమానం. వేరే టోర్నీలతో పోల్చినప్పుడు ఇది చాలా భిన్నమైన అంశం. చాలా అత్యుత్తమ జట్లను ఓడించి ఫైనల్​ చేరాము. లాక్​డౌన్​ కారణంగా ప్రస్తుతం ఫిజికల్​ ఫిట్​నెస్​, మానసిక దృఢత్వంపై మాత్రమే దృష్టి సారించాల్సి ఉంది. ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​కు ముందు సానుకూల దృక్పథంతో ఉండాలి. ఇప్పటికైతే అందరం వేర్వేరుగా ప్రాక్టీస్ చేస్తున్నాం. జట్టుగా ఆడినప్పుడు మేమేంటో నిరూపిస్తాం."

-ఉమేష్ యాదవ్, టీమ్​ఇండియా బౌలర్.

ఇదీ చదవండి:'జడేజా పేసర్​ అయితే కలిసి ఆడేవాళ్లం'

బబుల్​లో గడపడం కష్టం..

ఒక ఆటగాడిగా బబుల్​ లోపల గడపడం చాలా కష్టమైన విషయమని ఉమేష్ పేర్కొన్నాడు. పరిమిత ప్రదేశంలో రోజుల తరబడి ఉండాల్సి వస్తుందని తెలిపాడు. ఇలా ఉండాలంటే మానసికంగా, శారీరకంగా చాలా బలంగా ఉండాలని అభిప్రాయపడ్డాడు.

వారిద్దరి పాత్ర సుస్పష్టం..

కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ప్రధాన కోచ్​ రవిశాస్త్రి జట్టు కోసం చాలా కష్టపడ్డారని ఉమేష్ అభిప్రాయపడ్డాడు. వారిద్దరూ బౌలర్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తారని వెల్లడించాడు. మొత్తం 11మంది ఆటగాళ్ల మధ్య మంచి సమన్వయం ఉంటుందని పేర్కొన్నాడు. జట్టులో మంచి వాతావరణం ఉంటుందని ఉమేష్​ చెప్పుకొచ్చాడు.

మైదానంలో బరిలోకి దిగాక ఎలా గెలవాలన్న దానిమీదే దృష్టి ఉంటుందని యాదవ్ పేర్కొన్నాడు. గత ఐదేళ్లుగా భారత్​ అత్యుత్తమంగా ఆడుతోందని.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లను ఓడించే సత్తా టీమ్ఇండియాకు ఉందని వెల్లడించాడు. "అలా అని జట్టులో బలమైన ఫాస్ట్ బౌలింగ్ లైనప్ ఉందని కూడా చెప్పలేం. ఎందుకంటే చాలా జట్లలో ప్రతిభ ఉన్న క్రికెటర్లు ఎందరో ఉన్నారు. కానీ, ప్రస్తుత బౌలింగ్ విభాగం మాత్రం ఆశించిన స్థాయిలో ఉంది" అని ఉమేష్ తెలిపాడు.

ఇదీ చదవండి:'రోహిత్​కు బౌలింగ్ చేయడం సులభమే'

ABOUT THE AUTHOR

...view details