తెలంగాణ

telangana

ETV Bharat / sports

రసవత్తరంగా ఫైనల్​.. లంచ్ సమయానికి 130/5తో భారత్ - india all out in second innings reserve day

ఇంగ్లాండ్ వేదికగా న్యూజిలాండ్​తో జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భోజన విరామ సమయానికి టీమ్ఇండియా 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ప్రస్తుతం 98 పరుగుల ఆధిక్యంలో ఉంది భారత్​. క్రీజులో రిషభ్ పంత్(28), రవీంద్ర జడేజా(12) ఉన్నారు. కివీస్​ బౌలర్లలో జేమీసన్ 2, సౌథీ 2, బౌల్ట్​ ఒక వికెట్ తీసుకున్నారు.

wtc final, india vs new zealand
డబ్ల్యూటీసీ ఫైనల్, ఇండియా vs న్యూజిలాండ్

By

Published : Jun 23, 2021, 5:06 PM IST

సౌథాంప్టన్​ వేదికగా న్యూజిలాండ్​తో జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భోజన విరామ సమయానికి టీమ్ఇండియా 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో రిషభ్ పంత్(48 బంతుల్లో 28 పరుగులు), రవీంద్ర జడేజా(20 బంతుల్లో 12 పరుగులు) క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్లలో జేమీసన్​, సౌథీ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. టీమ్ఇండియా ప్రస్తుతం 98 పరుగుల ఆధిక్యంలో ఉంది.

కోహ్లీ వెంటనే..

ఓవర్​ నైట్​ స్కోరు 64/2తో బరిలోకి దిగిన టీమ్ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్​ ప్రారంభమైన కొద్దిసేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ(29 బంతుల్లో 13 పరుగులు).. ఓ అనవసర షాట్​కు పోయి కీపర్​ క్యాచ్​గా ఔటయ్యాడు. స్కోరు బోర్డులో మరో పరుగు చేరిందో లేదో నయా వాల్ పుజారా(80 బంతుల్లో 15 పరుగులు) కూడా పెవిలియన్​ చేరాడు. వీరిద్దరి వికెట్లు జేమీసన్ ఖాతాలో చేరాయి. ​

అనంతరం క్రీజులోకి వచ్చిన వైస్ కెప్టెన్ అజింక్య రహానె(40 బంతుల్లో 15 పరుగులు) కొద్దిసేపు క్రీజులో ఉన్నప్పటికీ.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. బాధ్యతరాహిత్య షాట్​కు పోయి బౌల్ట్​ బౌలింగ్​లో కీపర్ క్యాచ్​గా వెనుదిరిగాడు. దీంతో 109 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది టీమ్ఇండియా. తర్వాత బ్యాటింగ్​కు దిగిన జడేజా.. రిషభ్ పంత్​కు సహకరిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details