WTC 2021-23 Points Table: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఏడు వికెట్ల తేడాతో ఓడి టెస్టు సిరీస్ను చేజార్చుకున్న టీమ్ఇండియాకు మరో నిరాశ ఎదురైంది. ప్రొటీస్ జట్టు చేతిలో ఓటమి చెందిన నేపథ్యంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కొత్త పాయింట్ల పట్టికను ప్రకటించింది ఐసీసీ. ఇందులో కోహ్లీసేన.. మరో స్థానం కిందకు పడిపోయింది. 49.07 విజయాల శాతం, 53 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఇక సిరీస్ గెలుచుకున్న దక్షిణాఫ్రికా.. 66.66 విజయాల శాతం, 24 పాయింట్లతో నాలుగో ర్యాంకుకు చేరింది.
శ్రీలంక(100 శాతం, 24 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా(83.33 శాతం, 40 పాయింట్లు), పాకిస్థాన్(75 శాతం, 36 పాయింట్లు) రెండు, మూడు ర్యాంకుల్లో నిలిచాయి.