తెలంగాణ

telangana

On This Day in Cricket: రోహిత్ బొంబాట్ రికార్డుకు ఏడేళ్లు!

By

Published : Nov 13, 2021, 10:46 AM IST

రోహిత్ శర్మ(rohit sharma news).. ఈ పేరు వింటే ముందుగా గుర్తొచ్చేది డబుల్ సెంచరీ. పరిమిత ఓవర్ల క్రికెట్ చరిత్రలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ద్విశతకాలు చేసిన ఒకే ఒక్క బ్యాటర్ రోహిత్(rohit sharma double century list). శ్రీలంకపై ఏకంగా 264 పరుగులు చేసి వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన రికార్డునూ నెలకొల్పాడు హిట్​మ్యాన్. ఈ రికార్డు సాధించి నేటికి సరిగ్గా ఏడేళ్లు(rohit sharma 264 date) పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ ఇన్నింగ్స్​ను మరోసారి గుర్తుచేసుకుందాం.

Rohit Sharma
రోహిత్ శర్మ

టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ(rohit sharma news) గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ వన్డే ఆటగాళ్ల జాబితా తీస్తే ముందువరుసలో ఉంటాడు. తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తాడు. స్కోర్‌ బోర్డుపై బౌండరీలనే పరుగులు పెట్టిస్తాడు. అతడాడే షాట్లలో కచ్చితత్వం ఎంత ఉంటుందో కళాత్మకం అంతే చక్కగా ఉంటుంది. రోహిత్‌ పేరు కాస్తా 'రోహిట్‌', 'హిట్‌మ్యాన్‌'గా మారిందంటేనే అతడి ఆట ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. క్రికెట్‌ చరిత్రలో తనకంటే పలువురు గొప్ప బ్యాట్స్‌మెన్‌గా ఎదిగినా.. వాళ్లెవరికీ సాధ్యంకాని రికార్డును తన పేరిట వేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో ఎంత పెద్ద బ్యాట్స్‌మన్‌కైనా ద్విశతకం(rohit sharma double century list) జీవితకాల కలగానే ఉంటుంది. అలాంటిది ఈ హిట్‌మ్యాన్‌ నాలుగేళ్లలో మూడుసార్లు సాధించి క్రికెట్‌ ప్రపంచాన్ని ఔరా అనిపించాడు. అందులోనూ శ్రీలంకపై(rohit sharma vs sri lanka 264) ఏకంగా 264 పరుగులు(rohit sharma 264 highlights) సాధించి.. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు సాధించి నేటికి (నవంబర్ 13) ఏడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం..

వన్డేల్లో ఎంత గొప్ప బ్యాట్స్‌మన్‌కైనా ఒక జట్టుపై ఒకసారి ద్విశతకం బాదాలంటేనే ఊహకందని విషయం. అలాంటిది రోహిత్‌ 'సూపర్‌హిట్‌'గా మారి శ్రీలంకపై రెండుసార్లు దండయాత్ర చేశాడు. ఆస్ట్రేలియాపై అద్వితీయ ఇన్నింగ్స్‌(209 పరుగులు, 2013లో) ఆడిన మరుసటి సంవత్సరమే మరో మరుపురాని ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇది వన్డే క్రికెట్‌ చరిత్రలో 'న భూతో.. న భవిష్యతి'. 2014 నవంబరు 14న ఈడెన్​గార్డెన్స్​లో(rohit sharma 264 in which stadium) శ్రీలంకతో(rohit sharma vs sri lanka 264) జరిగిన మ్యాచ్​లో బౌండరీల వరద పారింది. బంతి ఏదైనా స్టాండ్స్​లోకే వెళ్లింది. రోహిత్.. 173 బంతుల్లో 264 పరుగులతో విజృంభించాడు. 33 ఫోర్లు, 9 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే శ్రీలంక అతడిని ఔట్ చేసే అవకాశాన్ని వదులుకుని భారీ మూల్యం చెల్లించుకుంది. అయితే ఈ మ్యాచ్​కు ముందు రోహిత్​ గాయం కారణంగా మూడు నెలలపాటు క్రికెట్ ఆడకపోవడం గమనార్హం.

రోహిత్.. తన కెరీర్​లో తొలి డబుల్ సెంచరీని(209) 2013లో ఆస్ట్రేలియాపై చేశాడు. 2017లో లంకేయులపై 208 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. రెండోసారి, మూడోసారి శ్రీలంకపైనే ఈ ఘనత సాధించడం విశేషం.

ఇవీ చూడండి: వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ.. త్వరలో ప్రకటన!

ABOUT THE AUTHOR

...view details