తెలంగాణ

telangana

బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ ఢమాల్.. టీమ్​ఇండియా లక్ష్యం 190

By

Published : Feb 5, 2022, 9:58 PM IST

U19 World Cup Final: అండర్​-19 వరల్డ్​ ఫైనల్​లో టీమ్​ఇండియా బౌలర్లు అదరగొట్టారు. పదునైన బౌలింగ్​తో ప్రత్యర్థి జట్టును స్పల్ప స్కోరుకే కట్టడి చేశారు. భారత్​ కప్పు కొట్టాలంటే 190 పరుగులు చేయాలి.

U19 World Cup Final
టీమ్​ఇండియా

U19 World Cup Final: అండర్​-19 ప్రపంచకప్​ ఫైనల్​లో టీమ్​ఇండియా యువ జట్టు ఆధిపత్యం చూపించింది. కట్టుదిట్టమైన బౌలింగ్​తో ప్రత్యర్థిని 44.5 ఓవర్లలో 189 పరుగులకే కట్టడి చేసింది. బౌలర్లు రాజ్​బవా 5 వికెట్లు తీయగా, రవికుమార్​ 4, కౌశల్ ఓ వికెట్ తీశారు.

అంతకు ముందు టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఇంగ్లాండ్​ మొదటనుంచే తడబడింది. భారత్​ బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్​ బ్యాటర్లను నిలువలేకపోయారు. ఓపెనర్​ జార్జి ధామస్​ 30 బంతుల్లో 27 పరుగులు చేయగా మరో ఓపెనర్​ జాకబ్​ రెండు పరుగులకే పెవిలియన్​ చేరాడు. మిడిల్​ ఆర్డర్​లో జేమ్స్​ రియూ(95)- జేమ్స్ సేల్స్(34).. 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.

యువబౌలర్​ రాజ్​బవా అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టాడు. 9.5 ఓవర్లలో కేవలం 31 పరుగులే ఇచ్చాడు. మరోవైపు రవి కుమార్​ 9 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. మరో బౌలర్​ కౌశల్​ తాంబే 5 ఓవర్లలో 29 పరుగులకు ఓ వికెట్​ పడగొట్టాడు.

ఇదీ చూడండి :IND vs WI 2022: ఇషాన్​కు సూపర్​ ఛాన్స్​.. ​రోహిత్​తో ఓపెనింగ్

ABOUT THE AUTHOR

...view details