దుబాయ్ వేదికగా స్కాట్లాండ్తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్ఇండియా బౌలర్లు చెలరేగిపోయారు. జడేజా, షమి విజృంభించగా 17.4 ఓవర్లలో స్కాట్లాండ్ జట్టు.. కేవలం 85పరుగులకే ఆలౌట్ అయ్యింది. షమి, జడేజా తలో మూడు వికెట్లు పడగొట్టారు.
ఇన్నింగ్స్ సాగిందిలా..
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీకి తన నిర్ణయం సరైనదే అని తెలిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన స్కాట్లాండ్.. భారత బౌలర్ల ధాటికి ఆ తర్వత కోలుకోలేకపోయింది. బుమ్రా తొలి వికెట్ తీసి ఇండియాకు బ్రేక్ ఇవ్వగా.. జడేజా, షమి రెచ్చిపోయారు. ముఖ్యంగా తన 4 ఓవర్ల కోటాలో జడేజా 15 పరుగులే ఇచ్చి.. 3 వికెట్లు పడగొట్టాడు. షమి.. కేవలం మూడు ఓవర్లలోనే 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. వీరిద్దరి బౌలింగ్ స్కాట్లాండ్ బ్యాటర్లు ఇద్దరు బౌల్ట్ అయ్యారు. అవి మ్యాచ్‌కే హైలైట్ అని చెప్పుకోవచ్చు. షమి వేసిన 17వ ఓవర్లో వరుసగా మూడు వికెట్లు పడ్డాయి(రెండో వికెట్ రనౌట్). జడేజా, షమి ఇచ్చిన ఊపుతో మిగిలిన బౌలర్లు కూడా జోష్ పెంచారు. బుమ్రా 2, అశ్విన్‌కు 1 వికెట్ తీశారు.