ICC World cup 2023 Hotstar : క్రికెట్ ఫ్యాన్స్‌కు ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్ ఓ తియ్యటి కబురును అందించింది. త్వరలో జరగనున్న ఆసియా కప్, ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ మ్యాచ్‌లను తమ ఓటీటీ వేదికపై ఉచితంగా వీక్షించవచ్చని ప్రకటించింది. అయితే, మొబైల్ వీక్షకులకు మాత్రమే ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది.
క్రికెట్ వినోదాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు డిస్నీ+ హాట్‌స్టార్ వెల్లడించింది. దీని ద్వారా భారత్‌లో 540 మిలియన్లకు పైగా ఉన్న మొబైల్ యూజర్లకు రాబోయే ప్రతిష్ఠాత్మక క్రికెట్ టోర్నమెంట్లను ఉచితంగా వీక్షించే అవకాశం లభిస్తుందని పేర్కొంది. అయితే ట్యాబ్లెట్లలో మ్యాచ్‌లను చూసే వారికి కూడా ఈ ఉచిత ఆఫర్ వర్తించనుందని తెలిపింది.
Asia cup 2023 Hotstar : ఆసియా కప్ 2023 సెప్టెంబరులో జరగనుంది. అలాగే పురుషుల ప్రపంచ కప్ అక్టోబరు 5న ప్రారంభమై.. నవంబరు 19వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో ఈ రెండు ప్రతిష్ఠాత్మక టోర్నీలకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. కాగా.. ఆసియా కప్‌లో భాగంగా మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. దాదాపు 10 దేశాలు తలపడనున్న వరల్డ్ కప్‌లో మొత్తం 48 మ్యాచ్‌లు జరుగుతాయి. క్రికెట్‌ను విపరీతంగా అభిమానించే భారత్‌లో ఈ రెండు టోర్నీలకూ విశేష ఆదరణ ఉంటుంది.