మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్ బ్యాటింగ్ జాబితాలో అగ్రస్థానానికి చేరింది టీమ్ఇండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్(Mithali Raj). నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 762 పాయింట్లతో తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది. దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టాప్కు ఎగబాకింది. తన 22 ఏళ్ల కెరీర్లో ఎనిమిదో సారి ఈ ఘనత సాధించడం విశేషం. మరో స్టార్ బ్యాట్స్ఉమన్ స్మృతి ఇరానీ.. 701 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
బౌలింగ్ విభాగంలో జూలన్ గోస్వామి(694 పాయింట్లు, 4వ స్థానం), పూనమ్ యూదవ్(617 పాయింట్లు, 9 స్థానం) తమ ర్యాంకుల్లో నిలిచారు. అయితే బౌలింగ్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా క్రికెటర్లు జెస్ జొనాస్సెన్ (808 పాయింట్లు), మేఘన్ షట్(762 పాయింట్లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
ఆల్రౌండర్ల విభాగంలో టీమ్ఇండియా మహిళా క్రికెటర్ దీప్తి శర్మ(331 పాయింట్లు) ఐదో ర్యాంకును దక్కించుకోగా.. మరిజన్నె కప్ (దక్షిణాఫ్రికా), ఎల్లిసా పెర్రి(ఆస్ట్రేలియా) తొలి రెండు స్థానాల్లో నిలిచారు.