తెలంగాణ

telangana

ETV Bharat / sports

గంగూలీతో కోల్డ్​వార్!.. విరాట్ సీరియస్ లుక్.. షేక్​హ్యాండ్ ఇచ్చుకోకుండానే.. - ఆర్సీబీ మ్యాచ్​లో విరాట్​ కోహ్లీ

ఆదివారం జరిగిన మ్యాచ్​లో ఆర్సీబీ ప్లేయర్​ విరాట్​ కోహ్లీ.. దిల్లీ క్యాపిటల్స్​ డైరెక్టర్​ సౌరభ్​ గంగూలీ మధ్య జరిగిన వ్యవహారం ప్రస్తుతం అనేక చర్చలకు దారి తీస్తోంది. అదేంటంటే..

virat kohli and sourav ganguly
virat kohli and sourav ganguly

By

Published : Apr 16, 2023, 11:32 AM IST

Updated : Apr 16, 2023, 11:43 AM IST

ఐపీఎల్​ సీజన్​ 16లో భాగంగా శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య పోరు రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ను ఆర్సీబీ ఓడించింది. ఇక ఈ మ్యాచ్​లో విరాట్ కోహ్లీ మరో అర్ధ సెంచరీని తన ఖాతాలో వేసుకుని మరోసారి తన ఫామ్‌ను కొనసాగించాడు. ఈ మొత్తం టోర్నమెంట్‌లో విరాట్​కు ఇది మూడో అర్ధశతకం కాగా.. అతని ఆట తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే మ్యాచ్​ సందర్భంగా జరిగిన రెండు ఘటనలు ఇప్పుడు చర్చనీయంశంగా మారాయి. అవేంటంటే..

దాదా -విరాట్​ కోల్డ్​ వార్ ?
మ్యాచ్​ అయిపోయాక ఇరు జట్లు కరచాలనం చేసుకునేందుకు మైదనంలోకి వచ్చాయి. ఈ క్రమంలో రెండు టీమ్స్​ షేక్​ హ్యాండ్స్​ ఇస్తున్న సమయంలో విరాట్​- సౌరభ్​ ఇద్దరూ దూరంగా వెళ్లిపోయారు. గంగూలీ దగ్గరికి వచ్చిన సమయంలో కోహ్లీ.. దిల్లీ కోచ్‌ పాంటింగ్‌తో వైపు చూస్తూ మాట్లాడాడు. గంగూలీ కోహ్లీని దాటి ముందుకు వెళ్లి వేరే ఆటగాడితో కరచాలనం చేశాడు. అయితే వారిద్దరూ కావాలనే ఇలా చేశారా అన్న విషయంపై స్పష్టత లేదు. దీంతో వారిద్దరి మధ్య ఇంకా కోల్డ్​ వార్​ నడుస్తున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. మ్యాచ్ మధ్యలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఫీల్డింగ్ చేస్తుండగా విరాట్ కోహ్లీ.. దాదావైపు కోపంగా ఓ లుక్ ఇచ్చాడని అభిమానులు ఓ ఫొటోను షేర్ చేస్తున్నారు. టీమ్‌ఇండియా వన్డే కెప్టెన్‌గా తనపై వేటు పడటంలో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీనే కారణమని విరాట్‌ భావిస్తూ అతడిపై పరోక్ష విమర్శలు చేయడంతో వీరి మధ్య అగాథం ఏర్పడ్డ సంగతి తెలిసిందే.

కాగా, ఆదివారం దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 23 పరుగులతో గెలుపొందింది. 34 బంతుల్లో అర్ధశతకాన్ని స్కోర్​ చేసి విరాట్​ కోహ్లీ రికార్డుకెక్కాడు. బెంగళూరు ఇన్నింగ్స్​లో కోహ్లీ ఆట హైలైట్​గా నిలిచింది. కానీ అతనిచ్చిన మంచి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోని ఆర్సీబీ.. ఇన్నింగ్స్‌ను పేలవంగా ముగించింది. అయినప్పటికీ మ్యాచ్​ను గెలుపొంది సంబరాలు చేసుకుంటోంది.

మైదానంలోకి దిగిన మొదట్లోనే వరుసగా రెండు ఫోర్లు కొట్టిన కోహ్లీ.. ఈ ఓవర్​తో తన పరుగుల వేటను ప్రారంభించాడు. కట్‌ షాట్లు, కవర్‌డ్రైవ్‌లు, స్ట్రెయిట్‌ డ్రైవ్‌లతో మైదానంలో చెలరేగిపోయి.. తన ఆటతీరుతో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాడు. ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో బ్యాక్‌ఫుట్‌పై బలంగా నిలబడి ఫ్లిక్‌తో కోహ్లీ కొట్టిన సిక్సర్‌కు స్టేడియం దద్దరిల్లిందనే చెప్పాలి. కానీ అర్ధశతకం తర్వాత అతను ఫుల్‌టాస్‌ను భారీషాట్‌ ఆడే ప్రయత్నం చేస్తున్న సమయంలో బౌండరీ లైన్‌ దగ్గర ఫీల్డర్‌కు చిక్కి పెవిలియన్​కు చేరుకున్నాడు.

Last Updated : Apr 16, 2023, 11:43 AM IST

ABOUT THE AUTHOR

...view details