స్లో ఓవర్‌రేట్ కారణంగా ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు జరిమానా పడింది. ఈ విషయాన్ని లీగ్ అధికారికంగా ప్రకటించింది. చెన్నై వేదికగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఒక ఓవర్‌ను తక్కువగా వేసింది ముంబయి. దీంతో రూ.12 లక్షలు ఫైన్ విధించారు.
జరిమానాల వివరాలివే..
- లీగ్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ తప్పిదం జరిగితే.. సంబంధిత టీమ్ సారథికి రూ.12 లక్షల జరిమానా విధిస్తారు.
- ఇదే జట్టు రెండో సారి స్లో ఓవర్‌రేట్ తప్పిదం చేస్తే కెప్టెన్‌కు రూ.24 లక్షలు ఫైన్‌తో పాటు జట్టు సభ్యులకు మ్యాచ్ ఫీజులో రూ.6 లక్షలు లేదా 25 శాతం.. ఏది తక్కువైతే అది విధిస్తారు.
- మూడో సారి ఇదే తప్పిదం జరిగితే టీమ్ సారథికి రూ.30 లక్షల జరిమానాతో పాటు మిగతా ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో రూ.12 లక్షలు లేదా 50 శాతం.. ఏది తక్కువైతే అది విధిస్తారు.