దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజలను అప్రమత్తం చేయడానికి సన్రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్లు తమ వంతు సాయానికి ప్రయత్నించారు. ప్రజలందరూ కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు వీడియో సందేశం పంపారు. వైరస్ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరు విధిగా సహకరించాలని కోరారు.
మనీశ్ పాండే, జానీ బెయిర్ స్టో, జేసన్ హోల్డర్, విజయ్ శంకర్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్.. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ.. ఉన్న వీడియోను ఎస్ఆర్హెచ్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఆటగాళ్లు వారి వారి తరహాలో అభిమానులను కొవిడ్ గురించి భద్రతలు చెప్పారు.