David Warner: టీ20 లీగ్‌లో గత రెండు సీజన్లు నిరాశపరిచిన డేవిడ్ వార్నర్ ప్రస్తుత సీజన్‌లో మాత్రం అదరగొట్టేస్తున్నాడు. ఐదు మ్యాచుల్లో మూడు అర్ధశతకాలతో 219 పరుగులు చేశాడు. రెండు దశల్లో జరిగిన 2021 సీజన్‌లో హైదరాబాద్ తరఫున ఆడిన డేవిడ్ వార్నర్.. ఎక్కువగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. అయినా హైదరాబాద్ రిటెయిన్ చేసుకోలేదు. దీంతో మెగా ఆక్షన్‌లోకి వచ్చిన డేవిడ్ వార్నర్‌ను దిల్లీ రూ.6.25 కోట్లకు దక్కించుకుంది. దిల్లీ తరఫున ఈ సీజన్‌లో బరిలోకి దిగిన డేవిడ్ వార్నర్ అత్యుత్తమ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. డేవిడ్ ఆటతీరుపై టీమ్‌ఇండియా క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ విశ్లేషించాడు.
'సన్‌రైజర్స్‌లో కరవైంది దిల్లీలో.. అందుకే వార్నర్ రెచ్చిపోతున్నాడు' - దిల్లీ క్యాపిటల్స్
David Warner: దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మారినప్పటి నుంచి ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంతోషంగా ఉన్నాడని అన్నాడు క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్. అదే తన బ్యాటింగ్‌లో మార్పు తీసుకొచ్చిందని చెప్పాడు. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశాడు సన్నీ.
"దిల్లీ డ్రస్సింగ్ రూమ్‌లోని పాజిటివ్ వాతావరణం డేవిడ్ వార్నర్ ఆటతీరుపై స్పష్టమైన ప్రభావం చూపింది. అందువల్లే అద్భుతంగా ఆడుతున్నాడు. ఇదే గత రెండు సీజన్లలో హైదరాబాద్ జట్టు ఫ్రాంచైజీ వద్ద దొరకలేదు. ఒక్కోసారి బాగా ఆడకపోతే డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం సరిగా అనిపించదు. ఇది గ్యారంటీగా ఆటపై ప్రభావం చూపుతుంది. అదే గతంలో డేవిడ్ వార్నర్ విషయంలో జరిగింది. ఎప్పుడైతే దిల్లీ జట్టుకు మారాడో వార్నర్ చాలా సంతోషంగా ఉన్నాడు. తన బ్యాటింగ్ ప్రదర్శనలోనూ మార్పు వచ్చింది. ఇంకా సాధించాలనే తపన కనిపిస్తోంది. గత సీజన్ ప్రదర్శనను పక్కనపెడితే తాను ఆడిన జట్ల కోసం డేవిడ్ ఎంతో చేశాడు. ప్రతి ఆటగాడి క్రీడా జీవితంలో ఫామ్ కోల్పోవడం జరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత పుంజుకుని రావడం మాత్రం అద్భుతం" అని సునిల్ గావస్కర్ ప్రశంసించాడు.
ఇదీ చూడండి:రాణించిన వార్నర్.. కోల్‌కతాపై దిల్లీ విజయం