తెలంగాణ

telangana

By

Published : May 29, 2021, 1:45 PM IST

Updated : May 29, 2021, 4:43 PM IST

ETV Bharat / sports

ipl 2021: యూఏఈ వేదికగా ఐపీఎల్​ రెండో దశ

యూఏఈ వేదికగా ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది బీసీసీఐ. అయితే షెడ్యూల్​ను ఇంకా ఖరారు చేయలేదని.. త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. భారత్​ వేదికగా టీ20 ప్రపంచకప్​ నిర్వహణపై జులై చివర్లో లేదా జూన్​ తొలి వారంలో తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.

IPL 202
దుబాయ్​లో ఐపీఎల్​ రెండో దశ

ఐపీఎల్ రెండో దశ నిర్వహణకు సంబంధించి బీసీసీఐ సర్వసభ్య సమావేశం(ఎస్​జీఎం) శనివారం జరిగింది. యూఏఈ వేదికగా సెప్టెంబర్-అక్టోబర్​లో మిగిలిన లీగ్ మ్యాచ్​లను జరపాలని నిశ్చయించారు. ఇందుకోసం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. త్వరలోనే షెడ్యూల్​ను ప్రకటిస్తామని తెలిపారు.


"గతేడాది లాగానే దుబాయ్​, షార్జా, అబుదాబి వేదికల్లో మ్యాచ్​లు జరుగుతాయి. విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండే విషయమై ఆయా దేశాల క్రికెట్​ బోర్డులతో బీసీసీఐ చర్చించనుంది. ఆస్ట్రేలియా ప్లేయర్స్​ అందుబాటులో ఉండనున్నారు. కానీ ఇంగ్లాండ్​, న్యూజిలాండ్​ ఆటగాళ్ల విషయమై స్పష్టత లేదు. 25 రోజుల పాటు ఈ మెగాలీగ్​ను నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం"-బీసీసీఐ అధికారి.

భారత్​లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీ20 ప్రపంచకప్​ను ఇక్కడ నిర్వహించే విషయమై మరోసారి చర్చలు జరిపాల్సిన అవసరముందని నిర్వాహకులు తెలిపారు. జూన్​ చివర్లో లేదా జులై తొలి వారంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

దుబాయ్​కి గంగూలీ, జై షా..

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆధ్వర్యంలో సోమవారం జరిగే బోర్డు సమావేశంలో.. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో పాటు కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాల్గొననున్నారు. ఇందులో భారత్​ వేదికగా అక్టోబర్​లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ గురించి చర్చించనున్నారు.

Last Updated : May 29, 2021, 4:43 PM IST

ABOUT THE AUTHOR

...view details