తెలంగాణ

telangana

ETV Bharat / sports

పంజాబ్​ హ్యాట్రిక్​ విజయం.. ప్లేఆఫ్ ఆశలు సజీవం - దిల్లీ పంజాబ్​ లైవ్​ మ్యాచ్​ స్క్వాడ్​

దిల్లీ క్యాపిటల్స్​పై కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్​ ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విజయంలో నికోలస్​ పూరన్​(53), మ్యాక్స్​వెల్​(32) క్రీలక పాత్ర పోషించారు. దిల్లీ బౌలర్లలో రబాడా(2), అక్సర్ పటేల్​, అశ్విన్​ తలో వికెట్​ తీశారు.

punjab beats delhi capitals
దిల్లీపై పంజాబ్​ విజయం

By

Published : Oct 20, 2020, 11:18 PM IST

Updated : Oct 20, 2020, 11:58 PM IST

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ హ్యాట్రిక్​ విజయాన్ని అందుకుంది. దుబాయ్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్​ ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విజయంలో నికోలస్​ పూరన్​(53), మ్యాక్స్​వెల్​(32) క్రీలక పాత్ర పోషించారు. మిగితా వారు నామమాత్రంగా రాణించారు. ఏదేమైనప్పటికీ ఈ విజయంతో ప్లేఆఫ్‌ అవకాశాలను సజీవంగానే ఉంచుకుంది. పాయింట్లతో పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంది. దిల్లీ బౌలర్లలో రబాడా(2), అక్సర్ పటేల్​, అశ్విన్​ తలో వికెట్​ తీశారు.

అంతకముందు టాస్​ గెలిచి బ్యాటింగ్​కు దిగిన దల్లీ క్యాపిటల్స్​లో ధావన్​ మళ్లీ శతకంతో గర్జించాడు. ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా శిఖర్‌ ధావన్‌ చరిత్ర సృష్టించాడు. 61 బంతుల్లోనే 12 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (14), రిషభ్ పంత్‌ (14) కాసేపు అతడికి తోడుగా నిలిచారు. మిగితా వారు విఫలమైపోయారు. దీంతో 20 ఓవర్లకు దిల్లీ 164 పరుగులు చేసింది. పంజాబ్​ బౌలర్లలో షమీ(2), మ్యాక్స్​వెల్​, అశ్విన్​, నీషమ్​ తలో వికెట్​ తీశారు.

Last Updated : Oct 20, 2020, 11:58 PM IST

ABOUT THE AUTHOR

...view details