తెలంగాణ

telangana

ETV Bharat / sports

'గంగూలీనే మర్చిపోయావా?'.. రవిశాస్త్రిపై నెటిజన్లు ఫైర్​

ఐపీఎల్​ విజయవంతంగా నిర్వహించడంపై బీసీసీఐకి చెందిన ఉన్నత అధికారుల పేర్లను ప్రస్తావిస్తూ, వారికి ధన్యవాదాలు తెలిపాడు టీమ్​ఇండియా కోచ్​ రవిశాస్త్రి. అయితే అందులో బోర్డు అధ్యక్షుడు గంగూలీ పేరు లేకపోవడం వల్ల నెటిజన్లు కోచ్​పై విరుచుకుపడుతున్నారు. అతడిని విపరీతంగా ట్రోల్​ చేస్తున్నారు.

By

Published : Nov 11, 2020, 2:30 PM IST

Ganguly
గంగూలీ

కరోనా పరిస్థితుల్లో అసాధ్యమనుకున్న ఐపీఎల్​ విజయవంతంగా ముగిసింది. దీంతో బీసీసీఐ, ఐపీఎల్​ గవర్నింగ్​ కౌన్సిల్​పై ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రీడాభిమానులు, మాజీ క్రికెటర్లు సోషల్​మీడియా ద్వారా లీగ్​ నిర్వాహకులను పొగడ్తలతో ముంచెత్తున్నారు. ఈ క్రమంలోనే వారికి అభినందనలు తెలుపుతూ టీమ్​ఇండియా కోచ్​ రవిశాస్త్రి పెట్టిన ట్వీట్​ వైరల్​గా మారింది. నెటిజన్లు అతడిపై తీవ్రంగా మండిపడుతున్నారు.

గంగూలీని మర్చిపోయావా?

ఐపీఎల్ ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్‌పై ముంబయి ఇండియన్స్ విజయం సాధించిన తర్వాత రవిశాస్త్రి ట్విట్టర్ వేదికగా లీగ్​ ఆర్గనైజర్లు, మెడికల్ బృందానికి ధన్యవాదాలు తెలిపాడు. ఐపీఎల్‌ను చక్కగా నిర్వహించారని కొనియాడాడు. దీన్ని డ్రీమ్ ఐపీఎల్‌గా మార్చారంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా, బ్రిజేష్ పటేల్ పేర్లను ప్రస్తావించాడు. కానీ తన ట్వీట్​లో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పేరును మాత్రం ట్యాగ్ చేయలేదు. దీంతో నెటిజన్లు టీమ్​ఇండియా కోచ్‌పై మండిపడుతున్నారు. 'కరోనా వేళలో.. అసాధ్యమనుకున్న ఐపీఎల్​ను దాదా సుసాధ్యం చేశాడు. కానీ మీరు ఆయన పేరును ట్యాగ్ చేయడం మర్చిపోయారంటూ' రవిశాస్త్రికి చురకలు అంటిస్తున్నారు.

గతంలో రవిశాస్త్రిని కాదని అనిల్ కుంబ్లేను టీమ్​ఇండియా సారథి కావడానికి గంగూలీ సాయపడ్డాడని.. అందుకే శాస్త్రి.. దాదా పేరును ట్యాగ్ చేయలేదని కొందరు విమర్శిస్తున్నారు.

ఇదీ చూడండి : 'ముంబయి గెలుపు ఎప్పటికీ మారదు'

ABOUT THE AUTHOR

...view details