తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అందుకే ఇషాన్​ కిషన్​ను సూపర్​ఓవర్​కు పంపలేదు'

అద్భుత ఇన్నింగ్స్​తో ఇషాన్​ కిషన్ అలసిపోవడం వల్లే అతడిని సూపర్​ ఓవర్​కు పంపలేదని అన్నాడు ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ. అందుకే ఇషాన్​ బదులు హార్దిక్ పాండ్యాను పంపామని స్పష్టం చేశాడు.

By

Published : Sep 29, 2020, 11:06 AM IST

IPL 13: Rohit Sharma opens up about not sending Kishan to bat in Super Over
'అందుకే ఇషాన్​ కిషన్​ను సూపర్​ఓవర్​కు పంపలేదు'

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ బ్యాట్స్​మన్​ ఇషాన్​ కిషన్​ అద్భుత బ్యాటింగ్​తో ఆకట్టుకున్నాడు. కానీ, అలాంటి బ్యాట్స్​మన్​ను సూపర్​ ఓవర్​లో బ్యాటింగ్​కు ఎందుకు పంపలేదనే దానిపై ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ స్పందించాడు. ఇషాన్​ కిషన్​ అప్పటికే అలసిపోయి ఉన్నాడని.. అందుకే అతడిని సూపర్​ఓవర్​కు పంపలేదని స్పష్టం చేశాడు.

ఇషాన్​ కిషన్​

"ఆట చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఛేదనలో మేము చాలా వెనుకపడి ఉన్నాం. ఇషాన్​​ కిషన్​ తన గొప్ప ఇన్నింగ్స్​తో మరింత ఆసక్తి పెంచాడు. ఎప్పటిలాగే పొలార్డ్ అద్భుత ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్​లో జట్టుకు సరైన ప్రారంభాన్ని ఇవ్వలేకపోయాం. కానీ, బలమైన బ్యాటింగ్​ లైనప్​తో​ లక్ష్యాన్ని ఛేదించగలమని భావించాం. బరిలో పొలార్డ్​ ఉంటే ఏదైనా సాధ్యమే.. ఇషాన్​ కిషన్​ కూడా కొట్టగలడు. గెలుస్తామనే నమ్మకం మాకు కలిగింది. ఇషాన్​ కిషన్​ అప్పటికే అలసిపోవడం వల్ల సూపర్​ఓవర్​ ఆడలేకపోయాడు. అందుకే హార్దిక్​ పాండ్యాను​ బరిలో దించాం. హార్దిక్​ అయితే హిట్టింగ్​ చేయగలడని అనుకున్నాం."

- రోహిత్​ శర్మ, ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​

సోమవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్​ చేసిన ఆర్సీబీ.. మూడు వికెట్లు కోల్పోయి 202 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో దిగిన రోహిత్​ సేన నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 రన్స్​ మాత్రమే చేయడం వల్ల మ్యాచ్​ టైగా నిలిచి సూపర్​ఓవర్​కు దారితీసింది. అందులో ముంబయి తొలుత బ్యాటింగ్ చేసి 7 పరుగులే చేయగా తర్వాత బెంగళూరు ఆ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించడం వల్ల టోర్నీలో రెండో గెలుపును రుచిచూసింది కోహ్లీసేన.

కిరన్​ పొలార్డ్​, ఇషాన్​ కిషన్​

మెరుపు ఇన్నింగ్స్​ వృథా

ఛేదనలో ముంబయి బ్యాట్స్​మెన్​ ఇషాన్‌ కిషన్‌(99; 58 బంతుల్లో, 2x4, 9x6), కీరన్‌ పొలార్డ్‌ (56; 23 బంతుల్లో 2x4, 5x6) రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేశారు. వీరిద్దరూ 30 బంతుల్లో 89 పరుగులు చేయడం వల్ల మ్యాచ్‌ టైగా మారింది. కానీ, సూపర్​ఓవర్​లో ముంబయి ఓడిపోవడం వల్ల వీరిద్దరి పోరాటం బూడిదలో పోసిన పన్నీరులా మారింది. బెంగళూరు బ్యాట్స్​మెన్​​ డివిలియర్స్, ఆరోన్​ ఫించ్​, దేవ్​దత్​ పడిక్కల్​ అర్థశతకాలతో పాటు శివమ్​ దూబె మెరుపు ఇన్నింగ్స్​ ఆర్సీబీకి కలిసొచ్చాయి.

ABOUT THE AUTHOR

...view details