తమ జట్టులో ముగ్గరు హిట్టర్లు ఉండటం చాలా మంచిదైందని ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి.. 209 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో ఎంతో ప్రయత్నించినా సరే హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు. ముంబయిలో క్వింటన్ డికాక్(67), ఇషాన్ కిషన్(31), హార్దిక్ పాండ్య(28) గెలుపులో కీలక పాత్ర పోషించారు.
"ఆటగాళ్ల ప్రదర్శన బాగున్నప్పటికీ, కాస్త నెమ్మదిగా సాగినట్లు కనిపించింది. అలాంటి పరిస్థితుల్లో 200 స్కోరు చేయడమంటే గొప్ప ప్రయత్నమనే చెప్పాలి. మా బౌలర్లు ఈ సారి అద్భుతం చేశారు. నేను కొన్ని అవకాశాలను మిస్ చేశా.. కానీ అవి వచ్చినప్పుడల్లా మన వంతు ప్రయత్నం చేయాలి. అద్భుతమైన స్కోరును సాధించిన కుర్రాళ్లకు అభినందనలు. మ్యాచ్ సాగే పరిస్థితిని బట్టే మిడిల్ ఆర్డర్‌ను నిర్ణయిస్తాం. ఈ నేపథ్యంలో జట్టులో ముగ్గురు పవర్ హిట్టర్లు ఉండటం చాలా మంచి విషయం"
రోహిత్ శర్మ, ముంబయి ఇండియన్స్ కెప్టెన్
ఈ మ్యాచ్‌లో ముంబయి బౌలర్లు బుమ్రా, పాటిన్సన్, బౌల్ట్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. "ఎన్ని ప్రణాళికలతో వచ్చినా కొన్నిసార్లు అది పనిచేయకపోవచ్చు. ఆ సమయంలోనే అత్యుత్తమ డెలివరీ వేయాల్సి ఉంటంది. నా ప్రణాళికలను వారిపై రుద్దను. వారేమనుకుంటున్నారో తెలుసుకుంటా. దాన్ని బట్టే ఫీల్డింగ్ ఏర్పాటు చేస్తాను" అని రోహిత్ పేర్కొన్నాడు.
సన్‌రైజర్స్‌పై విజయం సాధించిన ముంబయి