సొంతగడ్డపై జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 134 పరుగుల లక్ష్యాన్ని 16.1 ఓవర్లలోనే ఛేదించింది. ముంబయి జట్టు సమష్టిగా రాణించింది. హార్దిక్ పాండ్య మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది ముంబయి ఇండియన్స్. తొలి వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు ఓపెనర్లు రోహిత్ - డికాక్. అనంతరం 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మొదటి వికెట్‌గా ఔటయ్యాడు డికాక్.
తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్‌తో కలిసి రోహిత్ శర్మ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ 55 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరి వరకు రోహిత్‌కు సహకారమందించిన సూర్యకుమార్ 27 బంతుల్లో 46 పరుగులతో ఆకట్టుకున్నాడు.