కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో విజయబావుటా ఎగురవేసిన టీమ్ఇండియా.. రెండో మ్యాచ్‌లోనూ సత్తా చాటాలని సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన లంక జట్టు.. టీ20 ఫార్మాట్లోనైనా తమను తాము నిరూపించుకోవాలని చూస్తోంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రారంభంకానున్న ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి.
మనీశ్‌కు నిరాశే!
ఇంగ్లాండ్ పర్యటన కోసం వెళ్లాల్సిన టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్ పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌లకు విశ్రాంతి ఇస్తే తప్ప మిగిలిన పరిస్థితుల్లో జట్టులో మార్పులు చేసే అవకాశం లేదనే చెప్పాలి. ఒకవేళ భారత జట్టు యాజమాన్యానికి ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉంటే దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే ఛాన్సు ఉంది. మనీశ్ పాండేకు రెండో టీ20లో తుదిజట్టులో అవకాశం రాకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న బౌలింగ్ లైనప్‌లో ఎలాంటి మార్పులు ఉండకపొవచ్చు. వైస్‌కెప్టెన్ భువనేశ్వర్ సహా ఇతర బౌలర్లు చాహల్, చాహర్ వంటి వారు వికెట్లు పడగొడుతూ ఆకట్టుకుంటున్నారు. కానీ, హార్దిక్ పాండ్యా ప్రదర్శన జట్టుకు కొంత ఆందోళన కలిగిస్తోంది.
బౌలర్లు సత్తా చాటినా..