తెలంగాణ

telangana

IND vs SA Test: తొలి టెస్టులో ఈ రికార్డులు చెరిగిపోతాయా?

By

Published : Dec 26, 2021, 11:18 AM IST

IND vs SA Test: భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు మరికొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​ జరగబోయే సెంచూరియన్ పిచ్​ పరిస్థితి, వాతావరణం, బద్దలవ్వబోయే రికార్డులపై ఓ లుక్కేద్దాం.

IND vs SA 1st test pitch, vs SA 1st test records, భారత్-దక్షిణాఫ్రికా టెస్టు పిచ్, భారత్-దక్షిణాఫ్రికా టెస్టు రికార్డులు
IND vs SA

IND vs SA Test: దక్షిణాఫ్రికాలో మొట్టమొదటిసారి టెస్టు సిరీస్‌ నెగ్గడానికి ఇదే సరైన సమయమని భావిస్తోన్న కోహ్లీసేన సత్తా చాటేందుకు సిద్ధమైపోయింది. ఆతిథ్య జట్టుతో ఆదివారం నుంచే తొలి టెస్టు. ప్రస్తుతానికి రెండు జట్లూ సమంగా కనిపిస్తున్నాయి. ఎవరిది పైచేయో చెప్పలేం. 2014 నుంచి దక్షిణాఫ్రికా సెంచూరియన్‌లో ఓడిపోని నేపథ్యంలో భారత జట్టుకు గట్టి సవాలు తప్పదు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​ ద్వారా పలు రికార్డులు తిరగరాయాలని చూస్తున్న ఆటగాళ్లెవరో చూద్దాం.

రికార్డ్ అలర్ట్

  • మరో రెండు క్యాచ్​లు పడితే టెస్టు క్రికెట్​లో 100 క్యాచ్​ల రికార్డును అందుకుంటాడు టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ.
  • మరో మూడు క్యాచ్​లు పడితే టెస్టు క్రికెట్​ల్లో 100 క్యాచ్​ల మైలురాయిని చేరుకుంటాడు టీమ్ఇండియా సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానే.
  • మరో 5 వికెట్లు సాధిస్తే టెస్టు క్రికెట్​ల్లో 200 వికెట్ల క్లబ్​లో చేరతాడు టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ.
  • 8 వికెట్లు దక్కించుకుంటే టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్ల జాబితాలో కపిల్ దేవ్​ను దాటేసి రెండో స్థానానికి చేరతాడు రవి అశ్విన్. ప్రస్తుతం అశ్విన్ 427 వికెట్లతో ఉండగా.. కపిల్ 434 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇవి తెలుసుకోండి!

  1. ప్రస్తుత మ్యాచ్‌కు వేదికైన సెంచూరియన్‌లో భారత్‌ రెండు మ్యాచ్​లు ఆడింది. 2010లో ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ ఓటమి పాలైన భారత్‌.. 2018లో 135 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది.
  2. సఫారీ గడ్డపై భారత్‌ ఆడిన 7 టెస్టు సిరీస్‌ల్లో తలపడింది. 2010-11 సిరీస్‌ 1-1తో డ్రా కాగా.. మిగతా ఆరు సిరీస్‌లనూ దక్షిణాఫ్రికానే గెలిచింది.
  3. దక్షిణాఫ్రికాలో భారత్‌ 30 టెస్టులు ఆడింది. మూడు మాత్రమే నెగ్గి, 10 ఓడింది. ఏడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.
  4. సెంచూరియన్‌లో జరిగిన 26 టెస్టుల్లో దక్షిణాఫ్రికా 21 మ్యాచ్‌ల్లో గెలిచింది. 2 టెస్టులు ఓడగా.. 3 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.
  5. ప్రస్తుత దక్షిణాఫ్రికా జట్టులోని బ్యాట్స్‌మెన్‌లో డికాక్‌, ఎల్గర్‌ మాత్రమే గత మూడేళ్లలో సొంతగడ్డపై శతకాలు సాధించారు.

పిచ్.. వాతావరణం

IND vs SA Test Pitch: పిచ్‌పై ప్రస్తుతం చాలా పచ్చిక ఉంది. మ్యాచ్‌ సమయానికి దాన్ని కత్తిరించవచ్చు. పిచ్‌ పేస్‌ బౌలర్లకు అనుకూలించనుంది. తొలి రెండు రోజుల్లో వర్షం వల్ల ఆటకు అంతరాయాలు కలగొచ్చు. కానీ ఆ తర్వాత ఐదో రోజు వరకు వాతావరణం బాగుంటుంది. ఎండ కాస్తుంది.

ఇవీ చూడండి: 'బాక్సింగ్ డే టెస్టు'.. ఈ పేరెలా వచ్చిందో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details