ICC New Rule: టీ20 క్రికెట్‌కు మరింత మజా తీసుకొచ్చేందుకు ఐసీసీ నడుం బిగించింది. ఈ ఫార్మాట్లో తాజాగా ఓ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇందులో స్లో ఓవర్ రేట్‌కు సంబంధించిన ఈ రూల్ చాలా కీలకమైంది. ఇప్పటివరకు స్లో ఓవర్ రేట్‌కు కారణమైతే కెప్టెన్, ఆటగాళ్ల జీతాల్లో కోతలు విధించేవారు. అయితే ఇకపై మరో కొత్త నిబంధనను జట్టు భరించాల్సి ఉంటుంది.
కొత్త రూల్ ఏం చెబుతోంది..
ఫీల్డింగ్ చేసే జట్టు ఇన్నింగ్స్ చివరి ఓవర్ తొలి బంతిని నిర్దేశిత సమయానికే బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. అలా వేయకపోతే ఆ తర్వాత ఎన్ని ఓవర్లు (లేదా బంతులు) మిగిలినా.. 30 అడుగుల వృత్తం వెలుపల ఉన్న ఫీల్డర్లలో ఒకరిని తగ్గించాల్సి ఉంటుంది. అంటే సాధారణంగా ఐదుగురు ఫీల్డర్ల బదులు నలుగురిని మాత్రమే 30 యార్డ్ సర్కిల్ అవతల అనుమతిస్తారు.