ఈ ఏడాది ప్రారంభంలో ముగిసిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను 2-1 తేడాతో చిత్తుచేసింది టీమ్ఇండియా. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘోర పరాభవం పాలైనా.. తిరిగి పుంజుకుని సిరీస్ కైవసం చేసుకుంది. మొదటి మ్యాచ్ ఓటమి తర్వాత కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి రాగా అజింక్యా రహానే సారథ్యంలో టీమ్ఇండియా గొప్పగా పోరాడింది. తాజాగా ఈ విజయంపై స్పందించిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్.. భారత జట్టు పోరాడిన తీరును మెచ్చుకున్నాడు. అలాగే ఈ విజయంతో కోచ్ రవిశాస్త్రి ఎంత వైన్ తాగి ఉంటాదో ఊహించుకోగలనని తెలిపాడు.
"ఓటమి తర్వాత భారత జట్టు పుంజుకున్న తీరు, రహానే కెప్టెన్సీ అద్భుతం. గబ్బా మైదానంలో భారత్కు మంచి రికార్డు లేకున్నా ఆ మ్యాచ్ గెలిచిన తీరు ప్రశంసనీయం. రిషభ్ పంత్ పోరాడిన తీరు అనిర్వచనీయం. ఈ సిరీస్ మొత్తంలో ఓ కొత్త పంత్ కనిపించాడు. చివరి రెండు మ్యాచ్ల్లో అయితే బ్రిలియంట్ గేమ్ ఆడాడు. ఆ సమయంలో రవిశాస్త్రి ఎంత రెడ్ వైన్ తాగాడో అర్థం చేసుకోగలను."