మే నెలకు సంబంధించి 'ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు'(Player of The Month Award) నామినేషన్ల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) ప్రకటించింది. పురుషుల విభాగం నుంచి పాకిస్థాన్ క్రికెటర్ హసన్ అలీతో పాటు ప్రవీణ్ జయవిక్రమ(శ్రీలంక), ముష్ఫికర్ రహీమ్(బంగ్లాదేశ్) పేర్లను నామినేట్ చేసింది.
జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో పాక్ బౌలర్ హసన్ అలీ 14 వికెట్లు తీసుకున్నాడు. ఇక శ్రీలంక బౌలర్ జయవిక్రమ.. బంగ్లాదేశ్తో జరిగిన టెస్టులో 11 వికెట్లు కైవసం చేసుకున్నాడు. బంగ్లా క్రికెటర్ రహీమ్ శ్రీలంకతో జరిగిన సిరీస్లో అద్భుతంగా రాణించాడు. వన్డే సిరీస్ గెలవడానికి తన వంతు పాత్ర పోషించాడు.
ఇదీ చదవండి:జాతి వివక్ష: మరో క్రికెటర్ సస్పెండ్ కానున్నాడా?