పేదరాశి పెద్దమ్మ కథల్లో దెయ్యాల గురించి వినడమే తప్ప.. ఏనాడు బయట కనిపించిందే లేదు! అయితే ఈ కథల్లో దెయ్యాలు పాడుబడ్డ ఇళ్లు, మర్రిచెట్లు, శ్మశానాలకు వాటి ఖార్ఖానాలుగా మార్చుకొని నివసిస్తాయని వినికిడి. అయితే ఈ మధ్య కొన్ని మోడరన్ దెయ్యాలు జనావాసాల్లోకి వస్తున్నాయట. అది కూడా ఓ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో సందడి చేసి.. వికెట్ కూడా పడగొట్టాయనే వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. దెయ్యాలు క్రికెట్ ఆడడం ఏంటి? వికెట్ పడగొట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే దాని అసలు కథ ఏందో మీరే చూడండి.
ఏం జరిగిందంటే?
జింబాబ్వే, బంగ్లాదేశ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ ఈ విచిత్రమైన సంఘటనకు వేదికైంది. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ మహమ్మద్ సైఫుద్దీన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. వికెట్‌పై ఉండే బెయిల్స్‌లో ఒకటి పడిపోయింది. కానీ, వికెట్‌కు బంతి తాకలేదు. ఇలా ఎలా జరిగిందబ్బా? అని మళ్లీ ఆ వీడియోను తరచి చూస్తే.. అందులో వికెట్ దానంతట అదే వెనక్కి ఒరగడం సహా దానిపై బెయిల్ కూడా పడిపోయింది. దాన్ని చూసిన వారంతా అక్కడ దెయ్యం ఉంది కావచ్చొని ప్రచారం చేశారు. అది గాలికి అలా జరిగిందా? లేదంటే దెయ్యాల పనేనా? అంటూ కొందరు సోషల్‌మీడియాలో సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో కొంచెం విచిత్రంగా ఉండడం వల్ల వైరల్‌గా మారింది.
ఇదీ చూడండి..INDvsSL: లంకతో మిగిలిన టీ20లకు వారందరూ దూరం