తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2024, 1:12 PM IST

Updated : Jan 7, 2024, 2:39 PM IST

ETV Bharat / sports

మహిళా క్రికెటర్​ అరుదైన ఘనత - ఆ రికార్డును అందుకోనున్న తొలి ఆస్ట్రేలియా ప్లేయర్​ ఈమె

Ellyse Perry Ind Vs Aus : ఆస్ట్రేలియా స్టార్​ క్రికెటర్ ఎలీస్‌ పెర్రీ తాజాగా ఓ అరుదైన ఘనతను అందుకోనుంది. ముంబయి వేదికగా భారత్​తో జరగనున్న మ్యాచ్​లో ఆమె ఈ రికార్డును నమోదు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఆ విశేషాలు మీ కోసం

Ellyse Perry Ind Vs Aus
Ellyse Perry Ind Vs Aus

Ellyse Perry Ind Vs Aus : ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్టు ప్లేయర్ ఎలీస్‌ పెర్రీ తాజాగా ఓ అరుదైన ఘనతను అందుకుంది. ముంబయి వేదికగా ఆదివారం భారత్‌ – ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మ్యాచ్​తో తన ఇంటర్నేషనల్‌ కెరీర్‌లో 300వ మ్యాచ్​లను పూర్తి చేసుకోనుంది. అలా మహిళల క్రికెట్‌ చరిత్రలో 300 ప్లస్‌ ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ల జాబితాలో స్థానం సంపాదించుకోనుంది. అయితే ఈ లిస్ట్​లో ఇప్పటికే 333 మ్యాచులతో టీమ్ఇండియా మాజీ సారథి మిథాలీ రాజ్‌ మొదటి స్థానంలో ఉండగా, ఇంగ్లాండ్​ స్టార్​ చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ (309), కివీస్‌ మాజీ క్రికెటర్​ సూజీ బేట్స్‌ (309) తర్వాతి స్థానాలను కైవసం చేసుకున్నారు.

Ellyse Perry Career : పెర్రీ కెరీర్​ను చూస్తే 2007లో క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ క్రికెటర్​ తన సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటి వరకు 12 టెస్టులు, 141 వన్డేలు, 146 టీ20లు ఆడింది. డజను టెస్టులాడిన పెర్రీ 21 ఇన్నింగ్స్‌లలో 925 పరుగులు, 141 వన్డేలలో 114 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్‌కు వచ్చి 3,852 పరుగులు చేసింది.

India Vs Australia Womens : ప్రస్తుతం ఆస్ట్రేలియా- భారత్ మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్​ తొలి మ్యాచ్​లో టీమ్ఇండియా అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. అటు బౌలింగ్‌తో పాటు ఇటు బ్యాటింగ్​లోనూ దూకుడు చూపించి తొలి టీ20లో ఘన విజయాన్ని అందుకుంది. 9 వికెట్ల తేడాతో ఆసీస్‌ సేనను చిత్తు చేసింది. తొలుత తితాస్‌ సాధు (4/17) ధాటికి ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలోనే 141 పరుగులు స్కోర్ చేసింది. లిచ్‌ఫీల్డ్‌ (49), ఎలీస్‌ పెర్రీ (37), ఆసీస్​ జట్టులో రాణించారు. ఇక భారత్​ నుంచి షెఫాలి వర్మ (64*); స్మృతి మంధాన (54) సూపర్ ఫామ్​లో ఆడటం వల్ల టీమ్ఇండియా 17.4 ఓవర్లలో ఒకే వికెటే కోల్పోయి టార్గెట్​ను అందుకుంది.

ఇక ఆదివారం జరగనున్న పోరులోనూ నెగ్గి మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ పట్టేయాలని హర్మన్‌ప్రీత్‌ సేన పట్టుదలగా ఉంది. వన్డే సిరీస్‌లో వైట్‌వాష్‌ అయినప్పటికీ తొలి టీ20లో భారత్‌ వేగంగా పుంజుకుంది. అన్ని విభాగాల్లోనూ మెరుగైన ఫామ్​ను కనబరిచి ప్రత్యర్థిపై ఆధిపత్యం చలాయించింది. ముఖ్యంగా బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో బాగా మెరుగైంది. తితాస్‌ సాధు బంతులు వేసిన తీరు మిగిలిన బౌలర్లకు స్ఫూర్తినిచ్చింది. ఇదే జోరుని రెండో టీ20లోనూ చూపించాలని భారత్‌ పట్టుదలగా ఉంది.

ఆసీస్​ కెప్టెన్​ చేసిన పనికి భారత జట్టు​ ఫైర్​ - హర్మన్​కు అంత కోపం వచ్చిందా!

'ఏకైక టెస్ట్​లో ఓడినా మనసులు గెలిచేశావ్​గా'- హీలీ చేసిన పనికి ఫ్యాన్స్​ ఫుల్​ ఖుషీ!

Last Updated : Jan 7, 2024, 2:39 PM IST

ABOUT THE AUTHOR

...view details