తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్​ కోసం దిల్లీ ప్రయత్నాలు- రూ.కోట్ల ఆఫర్​- మరి డీల్ ఏమైంది?

Delhi Capitals Rohit Sharma : ముంబయి ఇండియన్స్ కెప్టెన్​గా రోహిత్ శర్మను తప్పించడం ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది. అయితే ఈ విషయం రోహిత్​కు ముందే తెలుసా? అతడి కోసం దిల్లీ క్యాపిటల్స్ విశ్వప్రయత్నాలు చేసిందా? 2025 మెగా వేలంలో రోహిత్ ఉంటాడా?

By ETV Bharat Telugu Team

Published : Dec 17, 2023, 10:47 AM IST

Delhi Capitals Rohit Sharma
Delhi Capitals Rohit Sharma

Delhi Capitals Rohit Sharma :దేశంలో ఐపీఎల్ హీట్ స్టార్ట్ అయింది. లీగ్​లో అత్యధిక బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​గా రోహిత్ శర్మను తప్పించడం హాట్​ టాపిక్​గా మారింది. ఐదు కప్పులు అందించిన రోహిత్​ను తప్పించి హార్దిక్ పాండ్యకు అప్పగించడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్​లో ముంబయి ఇండియన్స్​ను 4లక్షల మంది, ఇన్​స్టాలో 5లక్షల మంది అన్​ఫాలో చేశారు. ముంబయి రోహిత్​ను తప్పించాక వస్తున్న వార్తలు కొన్ని షాక్​కు గురిచేస్తున్నాయి

రోహిత్​కు ముందే తెలుసా?
కొద్దిరోజుల క్రితం గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యను ముంబయి ఇండియన్స్ బదిలీ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ముంబయికి వచ్చే ముందు హార్దిక్ తన కెప్టెన్సీ గురించి క్లారిటీగా మాట్లాడుకున్నాడట. ఆ డీల్ కుదిరాకనే జట్టులోకి వచ్చాడట. వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి ముంబయికి కెప్టెన్ హార్దిక్ పాండ్య అని, వన్డేప్రపంచకప్ జరిగే టైమ్‌లోనే రోహిత్‌కు ఈ విషయాన్ని ముంబయి ఫ్రాంచైజీ తెలియజేసిందట.

హిట్ మ్యాన్​ కోసం దిల్లీ విశ్వప్రయత్నాలు!
అయితే గుజరాత్‌తో ముంబయి చర్చలు సాగిస్తున్న సమయంలో రోహిత్ కోసం దిల్లీ క్యాపిటల్స్ ప్రయత్నాలు చేసిందని తెలుస్తోంది. హిట్‌మ్యాన్ కోసం దిల్లీ తీవ్రంగా ప్రయత్నించిందట. రూ.కోట్ల ఆఫర్ కూడా చేసిందట. కానీ కాంట్రాక్ట్ డీల్ కారణంగా అది కుదరలేదని సమాచారం. ఈ ఏడాది ఐపీఎల్​లో రిషభ్ పంత్ ఇంపాక్ట్ ప్లేయర్​గా ఆడాల్సి ఉన్నందున సీనియర్ ప్లేయర్​ కోసం దిల్లీ వెతుకుతోందట. అందులా భాగంగానే రోహిత్​ కోసం ట్రై చేసిందట. కానీ ఆ డీల్ కుదరకపోవడంతో పంతే నాయకత్వం వహిస్తాడట.

మెగావేలంలో రోహిత్ ఉంటాడా?
మరోవైపు రోహిత్‌కు ముంబయి తరపున 2024 సీజనే చివరదని వార్తలు వస్తున్నాయి. 2025 సీజన్ ముందు మెగా వేలం ఉంటుంది. ఆ సమయంలో ప్రతి జట్టు నలుగురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో ముగ్గురు భారత ఆటగాళ్లకు మాత్రమే ఛాన్స్. ఈ నేపథ్యంలో ముంబయి హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్‌, బుమ్రాను అట్టిపెట్టుకుని రోహిత్‌ను వదిలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో మెగా వేలంలో రోహిత్ ఉంటాడని కథనాలు వస్తున్నాయి. కాగా, ఐపీఎల్ మినీ వేలం దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న జరగనుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details