భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కె.ఎల్.రాహుల్‌లపై బీసీసీఐ అంబుడ్స్‌మన్ జరిమానా విధించింది. ఓ టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ ఆటగాళ్లకు రూ.20 లక్షల ఫైన్ వేసింది. చెరో 10 లక్షల రూపాయలను పారా మిలిటరీలో అమరులైన జవాన్ల కుటుంబాలకు అందించాలని ఆదేశించింది బీసీసీఐ. ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున సాయమందించాలని సూచించింది. మిగిలిన పదిలక్షలను అంధుల క్రికెట్ అసోసియేషన్‌కు ఇవ్వాలని ఆదేశించింది.
పాండ్య, రాహుల్‌కు రూ.20 లక్షలు జరిమానా - రాహుల్
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత ఆటగాళ్లు పాండ్య, రాహుల్‌లకు జరిమానా విధించింది బీసీసీఐ అంబుడ్స్‌మన్. ఇద్దరికీ చెరో రూ.20లక్షలు ఫైన్ వేసింది. ఈ డబ్బులో చెరో పదిలక్షలు పారామిలిటరీలో అమరులైన కుటుంబాలకు అందించాలని ఆదేశించింది బీసీసీఐ.
ఈ డబ్బును నాలుగు వారాల్లోగా బాధిత కుటుంబాలకు అందజేయాలని సూచించింది బీసీసీఐ. ఏప్రిల్ 19 నుంచి ఈ కాలపరిమితి అమలులో ఉంటుంది. ఒకవేళ ఇవ్వని పక్షంలో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత విధిస్తామని తెలిపింది.
ఆ ఏడాది జనవరిలో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా ఉన్న షోలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో కరణ్ అడిగిన ఓ ప్రశ్నకు అభ్యంతకర సమాధానమిచ్చినందుకు బీసీసీఐ వీరిపై సస్పెన్షన్ విధించింది. అనంతరం సుప్రీంకోర్టు శిక్షను రద్దు చేసింది. బీసీసీఐ ఇప్పుడు జరిమానా విధించింది.