ప్రపంచకప్ ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లబోతున్న తరుణంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి మీడియాతో మాట్లాడారు. పరిస్థితులకు అనుగుణంగా వరల్డ్‌కప్‌లో ఒత్తిడిని అధిగమించడమే ముఖ్యమని కోహ్లీ అన్నాడు.
బౌలర్లందరూ ఫిట్‌గా ఉన్నారని, సమష్టిగా రాణిస్తారని విశ్వాసం వ్యక్తం చేశాడు విరాట్. ఐపీఎల్ ప్రభావం వరల్డ్‌కప్‌లో ఉండదని, కుల్దీప్ ప్రపంచకప్‌లో సత్తాచాటుతాడని చెప్పాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌పై మాట్లాడిన కోహ్లీ.. ఒక్క జట్టు కోసం ఆలోచిస్తే ప్రపంచకప్‌పై దృష్టి పెట్టలేమని అన్నాడు. ప్రతీ మ్యాచ్‌ను సమంగానే చూస్తామని చెప్పాడు. తాను ఆడిన మూడు ప్రపంచకప్‌ల్లో ప్రస్తుతం జరగబోయే టోర్నీయే ఛాలెంజింగ్ కూడికుని ఉందని చెప్పాడు.
వ్యక్తిగతంగా ఈ ప్రపంచకప్ నాకు సవాల్‌తో కూడికుని ఉంది. జట్లన్ని బలంగా ఉన్నాయి. మాకు ఊపిరి తీసుకునే సమయం కూడా లేదు. ప్రారంభంలోనే నాలుగు పెద్ద జట్లతో తలపడనున్నాం. భారత జట్టు సమతూకంగా ఉంది. ప్రపంచకప్‌నకు అన్నీ విధాల సన్నద్ధమయ్యాం. కుల్దీప్,చాహల్‌లు ఇద్దరూ మాకు రెండు స్తంభాలు. వరల్డ్‌కప్‌లో వారు సత్తా చాటుతారు. -విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్