తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచకప్​లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన షకిబుల్​​

అఫ్గాన్​తో మ్యాచ్​లో షకిబుల్ ప్రపంచకప్​లో వెయ్యి పరుగులు చేసిన బంగ్లా ఆటగాడిగా రికార్డు సాధించాడు. అంతేకాకుండా 2011లో ఒకే మ్యాచ్​లో యువీ నెలకొల్పిన అర్ధతకంతో పాటు ఐదు వికెట్ల రికార్డునూ బద్దలు కొట్టాడు.

షకిబుల్

By

Published : Jun 25, 2019, 6:00 AM IST

Updated : Jun 25, 2019, 6:06 AM IST

బంగ్లాదేశ్ క్రికెటర్ షకిబుల్ హసన్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచకప్​లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి బంగ్లా ఆటగాడిగా రికార్డు సాధించాడు. అఫ్గాన్​తో జరిగిన మ్యాచ్​లో షకిబుల్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. 5 వికెట్లు పడగొట్టాడు.

యువీ రికార్డు బద్దలు..

2011లో యువీ నెదర్లాండ్స్​తో జరిగిన మ్యాచ్​లో 50 పరుగులతో పాటు బంతితోనూ మాయ చేశాడు. 31 పరుగలిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తాజాగా ఈ ఫీట్​ను బద్దలు కొట్టాడు బంగ్లా ఆల్​రౌండర్ షకిబుల్. అర్ధశతకంతో పాటు బౌలింగ్​లో 29 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ప్రపంచకప్​​లో ఓ బంగ్లాదేశ్​ బౌలర్​కి ఇవే అత్యుత్తమ గణాంకాలు.

ఈ మెగాటోర్నీలో టాప్ స్కోరర్​..

అఫ్గాన్​పై అర్ధశతకం చేసిన షకిబుల్ హసన్.. ఈ మెగాటోర్నీలో అత్యధిక పరుగులు(476) చేసిన ఆటగాడిగా నిలిచాడు. 447 పరుగులు చేసి డేవిడ్ వార్నర్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇంగ్లాండ్​, వెస్టిండీస్​పై షకిబుల్ రెండు శతకాలు చేశాడు. ఆరువేల వన్డే పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్న ఇద్దరుబంగ్లా ఆటగాళ్లలో షకిబ్ ఒకడు.

సౌతాంప్టన్ వేదికగా అఫ్గాన్​తో జరిగిన మ్యాచ్​లో బంగ్లాదేశ్ 62 పరుగుల తేడాతో గెలిచింది. ముష్ఫీకర్ రహీమ్(83), షకిబుల్ హసన్(51) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.

ఇది చదవండి: షకిబ్​ అదరహో... బంగ్లా సెమీస్​ ఆశలు సజీవం

Last Updated : Jun 25, 2019, 6:06 AM IST

ABOUT THE AUTHOR

...view details