తెలంగాణ

telangana

ప్రపంచకప్​లో విండీస్​కు షాక్​... రసెల్​ ఔట్​

By

Published : Jun 24, 2019, 10:14 PM IST

వన్డే ప్రపంచకప్​లో కరీబియన్​ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు హార్డ్​​ హిట్టర్, ఆల్​రౌండర్​ రసెల్​ మెగాటోర్నీ నుంచి నిష్క్రమించాడు. మోకాలి గాయంతో బాధపడుతున్న ఈ స్టార్...​ వరల్డ్​కప్​ నుంచి పూర్తిగా వైదొలిగాడు.

ప్రపంచకప్​లో విండీస్​కు షాక్​... రసెల్​ ఔట్​

ఐపీఎల్​లో సత్తా చాటిన వెస్టిండీస్​ స్టార్​ ఆల్​రౌండర్​​ రసెల్​ ప్రపంచకప్​లో నిరాశపరిచాడు. అంతేకాకుండా మోకాలి గాయంతో బాధపడుతున్న ఈ కరీబియన్​ హార్డ్​ హిట్టర్​ వరల్డ్‌కప్‌ నుంచి పూర్తిగా వైదొలిగినట్లు విండీస్​ యాజమాన్యం ప్రకటించింది. ఈ వరల్డ్​కప్​లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన రసెల్‌.. 36 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్​లో ఐదు వికెట్లు తీశాడు.
శనివారం న్యూజిలాండ్​పై ఆరు పరుగుల తేడాతో ఓడిపోయిన విండీస్​.. సెమీస్​పై ఆశలు నిలుపుకోవాలంటే మిగతా మూడు మ్యాచ్​ల్లోనూ గెలవాల్సిందే. ఇలాంటి సమయంలో రసెల్​ దూరమవడం జట్టుకు పెద్ద దెబ్బే. ఈ హిట్టర్​ స్థానాన్ని సునీల్​ అంబ్రిస్​తో భర్తీ చేయనున్నట్లు విండీస్​ యాజమాన్యం తెలిపింది.

ఆరు మ్యాచ్​ల్లో కేవలం ఒకే విజయం సాధించింది విండీస్​​.. నాలుగు పరాజయాలు చవిచూసింది. ఒక మ్యాచ్​ వర్షం కారణంగా రద్దయింది. ఫలితంగా 3 పాయింట్లతో జాబితాలో చివరి నుంచి మూడో స్థానంలో కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details