తెలంగాణ

telangana

ETV Bharat / sports

హిట్​ మ్యాన్​ ఖాతాలో ​సిక్సర్ల రికార్డు

ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో  రోహిత్‌ శర్మ 140 పరుగులతో చెలరేగి భారత ఇన్నింగ్స్‌లో కీలకపాత్ర పోషించాడు. ఆరంభం నుంచే పాక్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ భారత్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే ఈ మ్యాచ్​లో హిట్​మ్యాన్​ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.

హిట్​ మ్యాన్​ ఖాతాలో ​సిక్సర్ల రికార్డు

By

Published : Jun 16, 2019, 11:55 PM IST

టీమిండియా ఓపెనర్​ రోహిత్​శర్మ మాంచెస్టర్​ వేదికగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో అరుదైన ఘనత సాధించాడు. ఈ గేమ్​లో 3 సిక్సులు బాదిన హిట్​మ్యాన్ ధోనీ పేరిట ఉన్న సిక్సర్ల రికార్డును అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో కలిపి భారత్‌ తరఫున అత్యధిక సిక్స్‌లు కొట్టిన క్రికెటర్‌గా ధోని (355) పేరిట రికార్డు ఉండేది. తాజాగా పాక్‌తో మ్యాచ్‌లో 3 సిక్స్​లు కొట్టిన హిట్‌మ్యాన్‌ (358) మహీ రికార్డును అధిగమించాడు.

సిక్సర్ల వీరుల జాబితాలో భారత బ్యాట్స్​మెన్లు సచిన్‌ తెందుల్కర్‌ (264), యువరాజ్‌ సింగ్‌ (251), సౌరవ్‌ గంగూలీ (247), వీరేంద్ర సెహ్వాగ్‌ (243) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఈ మ్యాచ్​లోనే కెరీర్​ 24వ శతకం అందుకున్నాడు రోహిత్​. ప్రపంచకప్‌లో రోహిత్​కు ఇది మూడో శతకం. మొదటిది 2015 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై సాధించగా, మిగతా రెండు శతకాలు (దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌పై) ఈ ప్రపంచకప్‌లోనే అందుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details