ప్రస్తుత ప్రపంచకప్ టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు హార్దిక్ పాండ్య. ఈ క్రికెటర్ బ్యాటుతో అద్భుతంగా రాణిస్తున్నాడని, బౌలింగ్‌ను మరింత మెరుగుపర్చుకుంటే పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌గా అవుతాడని భారత మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ అన్నారు.
"అతడ్ని వేరొకరితో పోల్చకండి. స్వేచ్ఛగా ఆడనివ్వండి. ఇప్పటికే హార్దిక్ ప్రతిభను చూశాం. నాకంటే అతడు మెరుగ్గా తయారవ్వాలని కోరుకుంటున్నా. ఆల్‌రౌండర్ పాత్రలో బ్యాటింగ్ అద్భుతంగా చేస్తున్నాడు. బౌలింగ్‌నూ మెరుగుపర్చుకుంటే జట్టుకు చాలా ఉపయోగపడతాడు." -కపిల్‌దేవ్, భారత మాజీ క్రికెటర్