గాయం కారణంగాశిఖర్ ధావన్ప్రపంచకప్లో కొన్ని మ్యాచ్‌లకు దూరమవగా.. అతడి స్థానంలో ఎవరిని ఆడించాలి అనే దానిపై ఒక్కొక్కరు వివిధ రకాల పేర్లను ప్రతిపాదిస్తున్నారు. సునీల్ గావస్కర్, కెవిన్ పీటర్సన్.. రిషభ్ పంత్ పేరును సూచించారు. అయితే ఆ స్థానంలో అంబటి రాయుడు సరైన వ్యక్తి అని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు.
"శిఖర్ స్థానంలో రిషభ్ పంత్ సరైన వ్యక్తి. ఐపీఎల్లో తనేంటో నిరూపించుకున్నాడు. ఆ స్థానానికి పంత్ మాత్రమే అర్హుడు" -సునీల్ గావస్కర్, భారత మాజీ క్రికెటర్
"ఒకవేళ ప్రపంచకప్‌నకు శిఖర్ ధావన్ దూరమైతే అతడి స్థానంలో పంత్‌కు అవకాశమివ్వాలి. రాహుల్‌ను ఓపెనింగ్‌కు పంపి రిషభ్‌ను నాలుగోస్థానంలో ఆడించాలి" -కెవిన్ పీటర్సన్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్