ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ధన్యవాదాలు చెప్పాడు. 'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో తాత్కాలిక అడ్డంకుల గురించి ఆలోచించొద్దని విద్యార్థులకుమోదీ సూచించారు. ఈ సందర్భంగా ఈడెన్ గార్డెన్‌లో 2001లో ఆస్ట్రేలియాపై గంగూలీ సేన విజయం సాధించడంలో లక్ష్మణ్, ద్రవిడ్ భాగస్వామ్యం గురించి ఆయన వివరించారు. కష్టాలు తాత్కాలికంగానే ఉంటాయని వారిలో స్ఫూర్తి నింపారు.
"చారిత్రక కోల్‌కతా టెస్టు గురించి విద్యార్థులతో పంచుకుని వారిలో స్ఫూర్తి నింపినందుకు నరేంద్రమోదీ గారికి ధన్యవాదాలు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు నా సలహా ఇదే. మీ లక్ష్యాలు స్పష్టంగా ఉండాలి. వాటిని నిజం చేసుకునేందుకు అంకితభావంతో పనిచేయాలి. మరొకరితో పోల్చుకోవద్దు" -వీవీఎస్ లక్ష్మణ్, టీమిండియా మాజీ క్రికెటర్