ఆస్ట్రేలియా క్రికెటర్ ఫించ్ బిగ్‌బాష్ లీగ్‌లో మరోసారి సత్తాచాటాడు. మెల్బోర్న్ రెనిగేడ్స్‌కు సారథ్యం వహిస్తోన్న ఈ ఆటగాడు సెంచరీతో జట్టుకు మంచి స్కోర్ అందించాడు. సిడ్నీ సిక్సర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో 68 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. బీబీఎల్‌లో ఫించ్‌కు ఇది రెండో సెంచరీ.
-
Aaron Finch in #BBL09 today:
— ICC (@ICC) January 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
💥 109 runs
💥 68 balls
💥 Six fours
💥 Seven sixespic.twitter.com/nyObW1Pe2U
">Aaron Finch in #BBL09 today:
— ICC (@ICC) January 25, 2020
💥 109 runs
💥 68 balls
💥 Six fours
💥 Seven sixespic.twitter.com/nyObW1Pe2UAaron Finch in #BBL09 today:
— ICC (@ICC) January 25, 2020
💥 109 runs
💥 68 balls
💥 Six fours
💥 Seven sixespic.twitter.com/nyObW1Pe2U
కానీ జట్టును గెలిపించలేకపోయాడు
ఫించ్ సెంచరీతో మెరవగా రెనిగేడ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్ లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది. ఇందులో ఓపెనర్ జోష్ ఫిలిఫ్ 61 పరుగులతో రాణించగా.. ఆసీస్ సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ అర్ధసెంచరీ (66)తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. గత ఆరు సీజన్లలో స్మిత్‌కు ఇది తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఫలితంగా సిడ్నీ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇవీ చూడండి.. వివాదాలే మా ఇద్దరి మధ్య పోలిక: కంగనా రనౌత్