తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​: నయా లోగోతో ఆర్సీబీ టైటిల్​ వేట!

టీమిండియా స్టార్​ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ నాయకత్వం, ఎందరో అద్భుత ఆటగాళ్లు జట్టులో ఉన్నా.. ఆర్సీబీ ఒక్కసారీ కప్పు గెలవలేకపోయింది. ఈ సారి ఎలాగైనా టైటిల్​ గెలవాలని పట్టుదలతో ఉన్నట్లు కోహ్లీ గతంలోనే ప్రకటించాడు. ఇందులో భాగంగానే ఈ ఏడాది పలువురు కొత్త ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేసింది ఆర్సీబీ. తాజాగా లోగో మార్చింది ఆర్సీబీ ప్రాంఛైజీ.

By

Published : Feb 14, 2020, 11:07 AM IST

Updated : Mar 1, 2020, 7:34 AM IST

Virat Kohli-led Indian Premier League side Royal Challengers Bangalore unveiled its new logo
13వ సీజన్​ ఐపీఎల్​ కోసం ఆర్సీబీ లోగో మార్పు

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు (ఆర్సీబీ) అభిమానులకు సర్​ప్రైజ్​ ఇచ్చింది. ఈ ఏడాది 13వ సీజన్​ కోసం కొత్త లోగోతో స్వాగతం పలుకుతోంది. మార్చి 29 నుంచి ఈ మెగాటోర్నీ ప్రారంభం కానుంది. లోగోలో సింహం ఉంది. ఇది ధైర్యం, నిర్భయమైన ఆటకు గుర్తని వెల్లడించింది ఆర్సీబీ. ఇటీవల ఆర్సీబీ ప్రాంఛైజీ.. ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌తో టైటిల్‌ స్పాన్సర్‌ కోసం మూడేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది.

కోహ్లీతో సహా అందరూ అయోమయం...

ఇటీవల ఆర్సీబీ సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రొఫైల్‌ ఫొటోలు మాయమవడమే కాకుండా పలు పోస్టులు డిలీటయ్యాయి. ఇలా ఎందుకు జరిగిందో అర్థంకాక అభిమానులతో పాటు ఆర్సీబీ ఆటగాళ్లు కోహ్లీ, యుజువేంద్ర చాహల్‌, డివిలియర్స్​ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

2016లో రన్నరప్‌గా నిలిచిన కోహ్లీ జట్టు 2017, 2018, 2019 సీజన్లలో ఘోరంగా విఫలమైంది. ఫలితంగా 2020లో ఎలాగైనా గెలవాలని గత డిసెంబర్‌లో నిర్వహించిన వేలంలో.. ఆరోన్‌ ఫించ్‌, క్రిస్‌ మోరిస్‌, జోష్‌ ఫిలిప్‌, డేల్‌స్టెయిన్‌లను ఆ జట్టు కొనుగోలు చేసింది.

Last Updated : Mar 1, 2020, 7:34 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details