తెలంగాణ

telangana

ETV Bharat / sports

'వారందరికీ ఈ విజయమే సమాధానం'

తొలిటెస్టు ఓటమి తర్వాత సిరీస్​ను టీమ్​ఇండియా 0-4తో ముగిస్తుందని విశ్లేషకులు హేళన చేశారు. అయితే రెండు, నాలుగు టెస్టుల్లో విజయం, మూడో మ్యాచ్​ డ్రాతో ట్రోఫీని నిలబెట్టుకొని సగర్వంగా స్వదేశానికి రానుంది భారత జట్టు. ఈ విజయంపై తనదైన శైలిలో స్పందించాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ. విమర్శించిన వాళ్లందరూ లేచి తమ గెలుపును చూడాలని చెప్పాడు.

To everyone who doubted us after Adelaide, stand up and take notice: Kohli
'మమ్మల్ని అనుమానించినవాళ్లు.. లేచి ఈ గెలుపును చూడండి'

By

Published : Jan 19, 2021, 4:25 PM IST

టీమ్​ఇండియాను అనుమానించిన వాళ్లందరూ ఒకసారి లేచి జట్టు సామర్థ్యాన్ని చూడాలని అన్నాడు సారథి విరాట్ కోహ్లీ. గబ్బాలో ఆస్ట్రేలియాపై చారిత్రక విజయాన్ని అందించిన క్రికెటర్లకు అభినందనలు తెలియజేశాడు.

"అద్భుతమైన గెలుపు!!! సాధించాం. అడిలైడ్​ ఓటమి తర్వాత మమ్మల్ని శంకించిన వారందరూ ఒకసారి లేచి చూడండి. అత్యుత్తమ ప్రదర్శన చేశారు. మీరు చూపిన ఆత్మస్థైర్యం, ధృడ సంకల్పం వేరే స్థాయిలో ఉన్నాయి. క్రికెటర్లు, యాజమాన్యానికి అభినందనలు. ఈ చారిత్రక గెలుపును ఆస్వాదించండి. చీర్స్"

-విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ నాలుగు టెస్టుల సిరీస్​లో తొలి మ్యాచ్ అవ్వగానే భారత్​కు తిరిగొచ్చాడు కోహ్లీ. ఆ సమయంలో ప్రసవానికి దగ్గర్లో ఉన్న భార్య అనుష్క శర్మకు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. జనవరి 11న వారికి కూతురు జన్మించింది.

జయకేతనం

అడిలైడ్​లో జరిగిన తొలి టెస్టులో 36 పరుగులకు ఆలౌటైన టీమ్ఇండియా.. వైట్​వాష్​తో తిరిగెళ్తుందని తీవ్ర విమర్శలు వచ్చాయి. ​వాటన్నింటినీ తప్పని నిరూపిస్తూ మెల్​బోర్న్​ టెస్టులో జయకేతనం ఎగవేసింది భారత్. ఆ తర్వాత స్ఫూర్తిమంతమైన పోరాటంతో సిడ్నీ టెస్టును డ్రాగా ముగించింది.

ఇదీ చూడండి:గబ్బాలో 'యువ'గర్జన- టీమ్​ఇండియాకు ప్రశంసల వెల్లువ

ABOUT THE AUTHOR

...view details