ఈ ఏడాదికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.. ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీఎల్ ఫైనల్.. ప్రపంచకప్ తుదిపోరు.. టెస్టు ఛాంపియన్షిప్ ఆరంభం ఇలా ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచకప్‌కు టెస్టు ఛాంపియన్షికు మధ్యలో కొంతమంది క్రికెటర్లు తమ కెరీర్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ మిలీనియంలో అంతర్జాతీయ క్రికెట్లో చెరగని ముద్ర వేసి అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన కొంతమంది క్రికెటర్లపై ఓ లుక్కేద్దాం!
యువరాజ్ సింగ్..
భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన వీరుడు. ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదిన విధ్వంస కారుడు.. టీమిండియాకు ఎన్నో మరపురాని విజయాలు అందించిన ఆపద్బాంధవుడు యువరాజ్ సింగ్. ఊహించని విధంగా గత జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి అందరిని షాక్‌కు గురి చేశాడు. 18 ఏళ్ల కెరీర్లో 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో 36.06 సగటుతో 8701 పరుగులు చేశాడు. ఇందులో 14 శతకాలు, 52 అర్ధసెంచరీలు ఉన్నాయి. 58 టీ20ల్లో 28.02 సగటుతో 1177 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇందులో 8 అర్ధశతకాలు ఉన్నాయి. టెస్టుల్లో 33.93 సగటుతో 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు.. 11 అర్ధసెంచరీలు ఉన్నాయి.
హషీమ్ ఆమ్లా..
ఆమ్లా పేరు చెప్పగానే ఎవరికైన గుర్తొచ్చేది అతని నిలకడైన ఆటతీరు. ఎలాంటి బౌలర్‌నైనా సమర్థవంతంగా ఎదుర్కొంటూ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారతాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 2 వేలు, 3 వేలు, 4 వేలు, 5 వేలు, 6 వేలు, 7 వేల పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు ఆమ్లా. అలాగే సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధికంగా 27 సెంచరీలు సాధించాడు. 15 ఏళ్ల క్రికెట్ కెరీర్లో 349 మ్యాచ్‌లు ఆడిన ఆమ్లా అన్ని ఫార్మాట్లలో కలిపి 18 వేలకు పైగా పరుగులు చేశాడు. ఇందులో 55 సెంచరీలు, 88 అర్ధసెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అలాగే ఇంగ్లాండ్, ఇండియా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్లపై అత్యధిక టెస్టు పరుగులు చేసిన సఫారీ ఆటగాడిగా నిలిచాడు.
ఇమ్రాన్ తాహిర్..
సఫారీ జట్టు బౌలర్ ఇమ్రాన్ తాహిర్ అందరికీ సుపరిచితం. 'పరాశక్తి ఎక్స్‌ప్రెస్'గా గుర్తింపు తెచ్చుకున్న తాహిర్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 106 వన్డేలు, 20 టెస్టులు, 38 టీ20లు ఆడాడు. వన్డేల్లో 172, టెస్టుల్లో 57, టీ20లో 63 వికెట్లను పడగొట్టాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాహిర్ పాకిస్థాన్‌లో జన్మించాడు. తర్వాత దక్షిణాఫ్రికాకు చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. 31 ఏళ్ల వయసులో సఫారీల తరఫున వెస్టిండీస్‌పై తొలి వన్డే ఆడాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నాడు.