భారత జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ వరుస గాయాలతో సతమతమవుతున్నాడు. నిలకడగానే రాణిస్తున్నా.. ఎదురుదెబ్బలు తప్పట్లేదు.ప్రపంచకప్‌లో వేలి గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే వైదొలిగిన ధావన్.. ఆ తర్వాత ముస్తాక్ అలీ ట్రోఫీలో రీఎంట్రీ ఇచ్చి మళ్లీ గాయపడ్డాడు. చాలా రోజుల విరామం తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికైన ఇతడు.. వరుసగా 96, 74 పరుగులు చేసి మంచి ఫామ్ నిరూపించుకున్నాడు. అయితే మూడో మ్యాచ్‌లో శిఖర్ భుజానికి గాయమైంది. ఫలితంగా ఈ నెల 24 నుంచి మొదలయ్యే న్యూజిలాండ్ పర్యటనకు దూరమయ్యాడు. త్వరలోనే మరో ఆటగాడి ఎంపికపై నిర్ణయం తీసుకోనుంది సెలక్షన్ కమిటీ.
ఈ పర్యటనలో భాగం 5 టీ20ల సిరీస్‌ను ఆడనుంది భారత్. తర్వాత మూడు వన్డేలు, రెండు టెస్టుల్లో కివీస్‌తో తలపడనుంది. అయితే వన్డేలకు ధావన్ ఎంపికయ్యే అవకాశముంది.