తెలంగాణ

telangana

ETV Bharat / sports

వార్నర్​ దూకుడా... రసెల్ బీభత్సమా...!

చెరో నాలుగు మ్యాచ్​లు గెలిచి 8 పాయింట్లతో సమానంగా ఉన్నాయి సన్​రైజర్స్​, నైట్​రైడర్స్ జట్లు. ఈ రెండింటి మధ్య నేడు ఉప్పల్ వేదికగా సాయంత్రం 4 గంటలకు మ్యాచ్​ జరగనుంది. ప్రధానంగా రసెల్, వార్నర్​పైనే అందరి దృష్టి ఉంది.

By

Published : Apr 21, 2019, 7:20 AM IST

ఐపీఎల్

జోరు మీదున్న చెన్నైని ఓడించిన సన్​రైజర్స్ ఈ మ్యాచ్​లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో దాదాపు విజయం అంచులవరకు వెళ్లి పరాజయం పాలైంది కోల్​కతా నైట్ రైడర్స్​. నేడు ఈ రెండింటి మధ్య మ్యాచ్​ జరుగనుంది. ఉప్పల్ వేదికగా సాయంత్రం 4 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

చెరో నాలుగు మ్యాచ్​ల్లో గెలిచి సమాన పాయింట్లతో ఉన్నాయి ఇరు జట్లు. ఈ మ్యాచ్​ గెలిచి ప్లే ఆఫ్​కు మార్గం సుగమం చేసుకోవాలనుకుంటున్నాయి. ఇప్పటికే ఈ రెండింటి మధ్య జరిగిన తొలి మ్యాచ్​లో కోల్​కతా విజయం సాధించింది. సొంతగడ్డపై మ్యాచ్​ను ఎలాగైనా గెలవాలని భావిస్తోంది హైదరాబాద్.

కోల్​కతా నైట్​ రైడర్స్​..
ఇప్పటికే హ్యాట్రిక్​ ఓటములతో ఢీలా పడిన కోల్​కతా ఈ మ్యాచ్​పైనే ఆశలు పెట్టుకుంది. గత మ్యాచ్​లో బెంగళూరుపై విజయం దక్కినట్టే దక్కి దూరమైంది. ఆండ్రీ రసెల్(65), నితీశ్ రాణా (85) విజృంభించి జట్టును గెలుపు అంచుల వరకు చేర్చారు. కోల్​కతా బ్యాట్స్​మెన్​లో రాబిన్ ఉతప్ప, శుభ్​మన్ గిల్ నిలకడగా రాణిస్తున్నారు. దినేశ్​ కార్తీక్ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. మొన్నటివరకు బౌలర్లు ఆకట్టుకున్నా గత కొన్ని మ్యాచ్​ల్లో ధారాళంగా పరుగులిస్తున్నారు.

సన్​రైజర్స్​ హైదరాబాద్...
హ్యాట్రిక్​ ఓటముల అనంతరం చెన్నైపై విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉంది హైదరాబాద్ జట్టు. ఓపెనర్లు, బౌలర్లు రాణిస్తున్నా... మిడిల్​ ఆర్డర్​ పేలవంగా ఉంది. దీనిపై దృష్టిసారించాల్సి ఉంది. కోల్​కతాతో జరిగిన తొలిమ్యాచ్​లో చివరి వరకు వచ్చి ఓటమిపాలైంది సన్​రైజర్స్​. ఈ మ్యాచ్​లో సత్తాచాటాలని భావిస్తోంది. చెన్నైతో జరిగిన మ్యాచ్​లో అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న హైదరాబాద్​... నైట్​రైడర్స్​పైనా ఇదే ప్రదర్శన చేయాలని ఆశిస్తోంది. మరోసారి ఓపెనర్లు వార్నర్​, బెయిర్​స్టో పైనే ఆశలు పెట్టుకుంది హైదరాబాద్ జట్టు. కెప్టెన్ విలియమ్సన్ ఫామ్​లోకి రావాల్సిఉంది. అలాగే మిడిల్​ ఆర్డర్​లో హుడా, యూసుఫ్ పఠాన్​ సత్తా చాటాల్సి ఉంది. బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నారు. భువనేశ్వర్ తన సామర్థ్యం మేరకు సత్తా చాటాల్సి ఉంది.

జట్ల అంచనా...
కోల్​కతా నైట్ రైడర్స్

సునిల్ నరైన్, దినేశ్​ కార్తీక్ (కెప్టెన్, కీపర్), పీయుష్ చావ్లా, రాబిన్ ఉతప్ప, క్రిస్ లిన్, ఆండ్రీ రసెల్, కుల్దీప్ యాదవ్, నితీష్ రాణా, ప్రసిద్ధ్​ కృష్ణ, శుభ్​మన్​ గిల్, హారీ గుర్నే.

సన్ రైజర్స్ హైదరాబాద్
విలియమ్సన్(కెప్టెన్), వార్నర్, బెయిర్ స్టో(కీపర్), విజయ్ శంకర్, సందీప్ శర్మ, నదీమ్, దీపక్ హుడా, రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్, యూసుఫ్ పఠాన్, భువనేశ్వర్ కుమార్

ABOUT THE AUTHOR

...view details