ఆస్ట్రేలియాతో సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన టీమిండియా.. రెండో వన్డేలో అద్భుత విజయం సాధించింది. 36 పరుగుల తేడాతో గెలిచింది. సిరీస్ 1-1తో సమమైంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఆసీస్ స్టార్ స్మిత్.. ఓటమికి అసలు కారణం చెప్పాడు. మ్యాచ్ రసవత్తరంగా సాగుతుండగా, మిడిల్ ఓవర్లో వరుసగా వికెట్లు కోల్పోవడమే ఇందుకు కారణమన్నాడు.
"భారీ లక్ష్యం ఛేదించడంలో మిడిల్ ఓవర్లు ఎంతో కీలకం. ఈ సమయంలో ఓ వైపు పరుగులు చేస్తూనే, మరోవైపు వికెట్లను కాపాడుకోవాలి. ఈ మ్యాచ్‌లో 30 ఓవర్లపాటు మంచి రన్‌రేట్‌తో ఆడాం. కానీ 31వ ఓవర్లో లబుషేన్, 38వ ఓవర్లో నేను, క్యారీ వెనుదిరగడం జట్టు ఓటమికి ప్రధాన కారణం. నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో ఎలాంటి పొరపాట్లు చేయకుండా, మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను చేజిక్కుంచుకోవాలని అనుకుంటున్నాం" -స్టీవ్ స్మిత్, ఆసీస్ క్రికెటర్