తెలంగాణ

telangana

ETV Bharat / sports

యాక్సిడెంట్ కేసులో క్రికెటర్ కరుణరత్నే అరెస్ట్ - శ్రీలంక క్రికెట్

శ్రీలంక టెస్టు క్రికెట్ కెప్టెన్ కరుణరత్నేను ఓ యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ చేశారు కొలంబో పోలీసులు.

కరుణరత్నే

By

Published : Apr 1, 2019, 9:16 AM IST

ప్రపంచకప్​లో శ్రీలంక జట్టుకు సారథ్య బాధ్యతలు వహించనున్న దిముత్ కరుణరత్నే అరెస్టయ్యాడు. తాగి వాహనం నడిపి యాక్సిడెంట్ చేసినందుకు అరెస్టు చేస్తున్నట్లు కొలంబో పోలీసులు తెలిపారు.

"వ్యక్తిగత బెయిల్​పై కరుణరత్నేను విడుదల చేశాం. సోమవారం కోర్టులో హాజరుకావాలని చెప్పాం. అతడి వాహనాన్ని అదుపులోకి తీసుకున్నాం".
--ఓ పోలీస్ అధికారి

ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది.

కరుణరత్నే దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్​లో లంక జట్టుకు సారథ్యం వహించాడు. సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ విజయంతో ఇంగ్లండ్​లో జరిగే ప్రపంచకప్​కు కూడా కెప్టెన్​గా ఎంపికచేశారు లంక సెలెక్టర్లు.
ఇవీ చూడండి..
రబాడ యార్కర్లకు..గేల్ సిక్స్​లు కొడతాడా..!

ABOUT THE AUTHOR

...view details