తెలంగాణ

telangana

ETV Bharat / sports

సచిన్​ను సమం చేసిన కివీస్ బౌలర్ - tim southee

న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ... మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్​ను సమం చేశాడు. టెస్టుల్లో 69 సిక్సులు కొట్టి మాస్టర్ సరసన నిలిచాడు.

సౌథీ

By

Published : Aug 16, 2019, 5:10 PM IST

Updated : Sep 27, 2019, 5:03 AM IST

టిమ్​ సౌథీ.. ఈ పేరు వినగానే క్రికెట్ అభిమానులకు ఓ బౌలర్​ గుర్తొస్తాడు. కివీస్​ తరఫున ఆడుతున్న సౌథీ... స్వింగ్​, పేస్​తో ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ను ఇబ్బందిపెట్టగలడు. సిక్సులూ కొట్టగలడు. ఈ ప్రతిభతోనే టెస్టు​ల్లో సచిన్​ తెందూల్కర్​ను సమం చేశాడు.

ఎలా సాధ్యం...?

శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య గాలే వేదికగా మొదటి టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్​లో కివీస్ బౌలర్​ సౌథీ 10వ స్థానంలో బ్యాటింగ్​కు దిగి 19 బంతుల్లో 14 పరుగులు చేశాడు. ధనుంజయ డిసిల్వా బౌలింగ్​లో సిక్సు బాదాడు. తద్వారా టెస్టు క్రికెట్​లో 69 సిక్సులు కొట్టిన సచిన్​ను సమం చేశాడు. వీరిద్దరూ ఈ జాబితాలో ప్రస్తుతం 17వ స్థానంలో కొనసాగుతున్నారు.

సచిన్ 329 ఇన్నింగ్స్​ల్లో 69 సిక్సులు సాధించగా.. సౌథీ కేవలం 89 ఇన్నింగ్స్​లే తీసుకున్నాడు. ఇంకో సిక్స్ కొడితే సచిన్​ను దాటి పాకిస్థాన్​ మాజీ బ్యాట్స్​మెన్​ యూనిస్ ఖాన్ (70)​ను సమం చేయనున్నాడీ బౌలర్.

టెస్టు క్రికెట్​లో అత్యధిక సిక్సులు కొట్టిన రికార్డు కివీస్ మాజీ సారథి బ్రెండన్ మెక్​కల్లమ్ పేరిట ఉంది. 176 ఇన్నింగ్స్​ల్లో 107 సిక్సులు బాదాడీ ఆటగాడు. ఇతడితో పాటు ఆసీస్ మాజీ వికెట్ కీపర్​ గిల్​క్రిస్ట్​ మాత్రమే ఈ ఫార్మాట్​లో వందకు పైగా సిక్సులు కొట్టారు.

ఇవీ చూడండి.. బంతి తగిలి... అంపైర్​ మృతి

Last Updated : Sep 27, 2019, 5:03 AM IST

ABOUT THE AUTHOR

...view details