తెలంగాణ

telangana

ETV Bharat / sports

అయ్యర్ ఆటతీరు ఆకట్టుకుంది: రాహుల్ - shreyas iyers execution was perfect says kl rahul

న్యూజిలాండ్​తో తొలి టీ20లో టీమిండియా యువ బ్యాట్స్​మన్ శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు. ఇతడి ప్రదర్శనపై మాజీలతో పాటు సహ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా కేఎల్ రాహుల్.. అయ్యర్​ ఆటతీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

kl rahul
రాహుల్

By

Published : Jan 25, 2020, 11:34 AM IST

Updated : Feb 18, 2020, 8:32 AM IST

ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన తొలి టీ20లో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది. యువ బ్యాట్స్​మన్ శ్రేయస్ అయ్యర్ అర్ధశతకం చేసి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఇతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్.. అయ్యర్ ఆటతీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"ఇది చాలా మంచి పరిణామం. ప్రతి ఆటగాడు గెలుపు కోసం కృషి చేశాడు. ముఖ్యంగా శ్రేయస్‌ బ్యాటింగ్​ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అర్ధసెంచరీ చేసిన తర్వాత కూడాఅతడు ప్రశాంతంగా ఉన్నాడు. జట్టు విజయం సాధించిన తర్వాత సెలబ్రేషన్స్‌ చేసుకోవడం అభినందనీయం. ఐపీఎల్‌లో ఓ జట్టు సారథిగా అతడు పరిస్థితులను అర్థం చేసుకుని మ్యాచ్‌లను ముగిస్తున్నాడు" -కేఎల్ రాహుల్, టీమిండియా క్రికెటర్

ప్రస్తుతం కీపింగ్‌ బాధ్యతలను ఆస్వాదిస్తున్నానని అన్నాడు రాహుల్. వికెట్ల వెనక ఉండటం వల్ల మ్యాచ్‌, పిచ్‌పై పూర్తి అవగాహన ఏర్పడుతుందని చెప్పాడు. బ్యాట్స్‌మన్‌గా ఎలాంటి షాట్స్‌ ఆడాలో ఓ అవగాహన వస్తుందని తెలిపాడు.

ఇవీ చూడండి.. అభిమానిని తిట్టి, ఆపై క్షమాపణలు చెప్పిన స్టోక్స్

Last Updated : Feb 18, 2020, 8:32 AM IST

ABOUT THE AUTHOR

...view details