వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్‌పై ప్రశంసలు కురిపించాడు మాజీ క్రికెటర్ గావస్కర్. నాలుగో స్థానంలో పంత్ కంటే మెరుగైన ఆటగాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఎప్పటి నుంచి భారత్ జట్టును వేధిస్తోన్న మిడిలార్డర్ సమస్యను శ్రేయస్ భర్తీ చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
"శ్రేయస్ అయ్యర్ తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీతో అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పాడు. మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా యువ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్‌కు ఫినిషర్ బాధ్యతలు అప్పగిస్తే సహజ సిద్ధంగా ఆడేందుకు ప్రయత్నిస్తాడు. టీమిండియా టాప్ ముగ్గురు ఆటగాళ్లు 40-45 ఓవర్లపాటు ఆడితే.. తర్వాత బ్యాటింగ్‌కు పంత్ వస్తే బాగుంటుంది. అదే వారు త్వరగా పెవిలియన్ చేరితే నాలుగో స్థానంలో శ్రేయస్ సరైన ప్రత్యామ్నాయం" .