తెలంగాణ

telangana

ETV Bharat / sports

బుమ్రాకు సలహాలిచ్చి నెటిజన్లకు దొరికిపోయాడు!

కివీస్​తో మూడో టీ20లో బుమ్రా బౌలింగ్​ను మెచ్చుకుని, ట్రోలింగ్​కు గురవుతున్నాడు కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్. కొందరు నెటిజన్లు.. అతడిపై మీమ్స్, కామెంట్స్ చేస్తున్నారు.​

బుమ్రాకు సలహాలిచ్చి నెటిజన్లకు దొరికిపోయాడు!
బుమ్రా

By

Published : Jan 31, 2020, 9:25 AM IST

Updated : Feb 28, 2020, 3:16 PM IST

క్రికెట్ వ్యాఖ్యత సంజయ్ మంజ్రేకర్​ మరోసారి నెటిజన్లకు దొరికిపోయాడు. భారత్ స్టార్ పేసర్ బుమ్రాకు బౌలింగ్​లో సలహాలిస్తూ ట్రోలింగ్​కు గురయ్యాడు. న్యూజిలాండ్​తో జరిగిన మూడో టీ20లోని సూపర్​ ఓవర్​లోబుమ్రా.. అత్యధిక పరుగులిచ్చిన తర్వాత సంజయ్ చేసిన ట్వీట్.. ఈ చర్చకు కారణమైంది.

అసలేం జరిగింది?

బుధవారం జరిగిన భారత్-న్యూజిలాండ్​ మూడో టీ20 తొలుత టై అయింది. ఆ తర్వాత సూపర్​ ఓవర్​లో మొదట కివీస్​ బ్యాటింగ్. బౌలింగ్ చేసిన బుమ్రా 17 పరుగులిచ్చాడు. అనంతరం రోహిత్ శర్మ బ్యాటింగ్ వల్ల​ టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఆ తర్వాత సంజయ్ మంజ్రేకర్.. "సూపర్​ ఓవర్​లో బుమ్రా బౌలింగ్ చూశాను. అతడో అద్భుతమైన బౌలర్​. కాకపోతే క్రీజును ఉపయోగించి, ఇంకా వినూత్నంగా బౌలింగ్ చేయొచ్చు" అని ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు.. "చాలు ఇక ఆపు. సాధారణ ప్లేయర్​ అయిన నువ్వు బుమ్రాకు సలహాలిస్తావా", "బుమ్రా స్థానంలో నువ్వుండుంటే 17 కాదు 34 పరుగిలిచ్చేవాడివి" అంటూ రీట్వీట్స్ చేస్తున్నారు.

కామెంటేటర్​ సంజయ్ మంజ్రేకర్

ఈ మ్యాచ్​లో బుమ్రా.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ధారాళంగా పరుగులిచ్చాడు. ఇతడి బౌలింగ్​లో కివీస్​ కెప్టెన్​ విలియమ్సన్​ ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. భారత బౌలర్లందరిలో షమి మాత్రమే ఆకట్టుకున్నాడు. మ్యాచ్​లోని చివరి ఓవర్​ అద్భుతంగా బౌలింగ్ చేసిన ఇతడు.. విలియమ్సన్​ను ఔట్ చేశాడు. పరుగులు చేయకుండా నియంత్రించాడు. లేదంటే టై అయిన ఈ మ్యాచ్​ న్యూజిలాండ్​ వశమయ్యేది.

సూపర్​ ఓవర్​లో గెలిచన అనంతరం రోహిత్ శర్మ

భారత్-న్యూజిలాండ్​ మధ్య నాలుగో టీ20..​ ఈరోజు(శుక్రవారం) వెల్లింగ్​టన్​లో జరగనుంది. ఇప్పటికే 3-0తో సిరీస్​లో ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన.. జట్టులో మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది.

Last Updated : Feb 28, 2020, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details