తెలంగాణ

telangana

ETV Bharat / sports

కరోనా విరామం తర్వాత క్రికెట్ కష్టమే!

మహమ్మారి కరోనా ప్రభావం తగ్గినా సరే మొదట్లో పూర్తిస్థాయి ప్రదర్శన ఇవ్వడం కష్టమేనని చెబుతోంది మహిళా బౌలర్ పూనమ్ యాదవ్.

కరోనా విరామం తర్వాత క్రికెట్ కష్టమే!
బౌలర్ పూనమ్ యాదవ్

By

Published : Jul 26, 2020, 9:09 AM IST

నెలలపాటు ఖాళీగా ఉన్న క్రికెటర్లకు ఆట మొదలైన ఆరంభంలో పూర్తి తీవ్రతతో ఆడటం కష్టమని అభిప్రాయపడింది భారత మహిళ జట్టు స్పిన్నర్ పూనమ్ యాదవ్. చివరగా మార్చిలో ఆస్ట్రేలియాతో టీ20 ఫైనల్​ ఆడిన ఈమె.. పలు విషయాలు వెల్లడించింది.

"నాలుగైదు నెలల తర్వాత మైదానంలో అడుగుపెడితే ఏ క్రికెటర్​కైనా పూర్తిస్థాయిలో ప్రదర్శన ఇవ్వడం కష్టమే. కానీ మమ్మల్ని మేం ఫిట్​గా ఉంచుకుంటున్నం. సమూహంగా సాధన చేయడానికి మాకు అనుమతి లభించింది. 20-25 రోజుల్లో మేం పూర్తి ఫిట్​నెస్​ సాధిస్తాం" అని పూనమ్ చెప్పింది.

భారత మహిళా బౌలర్ పూనమ్ యాదవ్

షెడ్యూల్​ ప్రకారం భారత మహిళా జట్టు సెప్టెంబరులో ఇంగ్లాండ్​లో పర్యటించాల్సి ఉంది. కరోనా కారణంగా అది రద్దయింది. తర్వాత పెద్ద టోర్నీ అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరిగే ప్రపంచకప్పే. కానీ ప్రాణాంతకర వైరస్​ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో దాని నిర్వహణ సందేహంగా మారింది. ఈ విషయమై ఐసీసీ, రెండు వారాల్లో నిర్ణయం తీసుకోనుంది.

ABOUT THE AUTHOR

...view details