తెలంగాణ

telangana

రెండు దశాబ్దాల తర్వాత పాక్​కు​ వెళ్లనున్న ఆస్ట్రేలియా...!

By

Published : Dec 11, 2019, 5:30 AM IST

Updated : Dec 11, 2019, 7:08 AM IST

పాక్​తో వారి సొంతగడ్డపై టెస్టు మ్యాచ్​లు ఆడేందుకు అంగీకరించిందట ఆస్ట్రేలియా. 1998 తర్వాత నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా పాక్​ గడ్డపై టెస్టులు ఆడలేదు కంగారూ జట్టు. శ్రీలంక, ఇంగ్లాండ్​, యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​ దేశాల్లోని తటస్థ వేదికలపైనే పాక్​తో మ్యాచ్​లు ఆడింది.

pakistan vs australia: cricket australia agrees to send team to Pakistan for Test series in 2022
19 ఏళ్ల తర్వాత పాక్​ వెళ్లనున్న ఆస్ట్రేలియా...!

సొంతగడ్డపై క్రికెట్​ ఆడేందుకు అన్ని దేశాలను ఆహ్వానిస్తోంది పాకిస్థాన్​ క్రిెకెట్​ బోర్డు (పీసీబీ). ఇప్పటికే పలు దేశాలను బతిమిలాడుకోగా... ఇటీవల శ్రీలంక దాయాది దేశంలో అడుగుపెట్టింది. తాజాగా ఆస్ట్రేలియా కూడా అంగీకారం తెలిపినట్లు పీసీబీ సీఈవో వసీం ఖాన్​ తెలిపాడు. ఆస్ట్రేలియా మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ను పాక్​లో ఆడేందుకు ఒప్పుకున్నట్లు తాజాగా వెల్లడించాడు. ఈ ఒప్పందం ప్రకారం 2022లో పాక్​లో టెస్ట్ మ్యాచ్​లు ఆడనుంది ఆసీస్​ జట్టు.

వసీం ఖాన్​, పీసీబీ సీఈవో.

" ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డు పాకిస్థాన్​లో మూడు టెస్టులు ఆడేందుకు ఒప్పుకొంది. 2022లో మా గడ్డపై ఆసీస్..​ మ్యాచ్​లు ఆడేందుకు మేము ఎంతో శ్రమించాం."

-- వసీం ఖాన్​, పీసీబీ సీఈవో

టెస్టు హోదా ఉన్న దేశాల్లో అందరూ ఏడాదికి 14 మ్యాచ్​లు ఆడుతుంటే.. పాక్​ మాత్రం ఆరు నుంచి ఏడు మాత్రమే ఆడుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు వసీం. దీనికి ప్రధాన కారణం తటస్థ వేదికలపై మ్యాచ్​లు నిర్వహించడమేనని అభిప్రాయపడ్డాడు.1998 తర్వాత నుంచి ఇప్పటివరకు పాక్​ గడ్డపై టెస్టులు ఆడలేదు కంగారూ జట్టు. ప్రస్తుతం శ్రీలంక, ఇంగ్లాండ్​, యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​ దేశాల్లోనే పాక్​ తన మ్యాచ్​లను నిర్వహించుకుంటోంది.

జనవరిలో బంగ్లాదేశ్​నూ టెస్టు ఛాంపియన్​షిప్​లో మ్యాచ్​లు ఆడాలని ఆహ్వానాన్ని పంపింది పాకిస్థాన్​. అయితే ప్రస్తుతం ఈనెలలో శ్రీలంకతో టెస్టు మ్యాచ్​లు ఆడనుంది. ఈ ఆటగాళ్లకు కల్పించిన భద్రతను పరిశీలించుకున్నాక బంగ్లా కూడా ఒప్పుకునే యోచనలో ఉన్నట్లు క్రీడావర్గాల సమాచారం. బంగ్లాదేశ్​ 2008 నుంచి ఒక్కసారి దాయాది దేశంలో అడుగుపెట్టలేదు.

ఈ దేశాలతో పాటు అఫ్గానిస్థాన్​, ఐర్లాండ్​, దక్షిణాఫ్రికా బోర్డులతోనూ సంప్రదింపులు జరుపుతోంది పాక్.​ వీలైతే ఈ దేశాలు 2020లోనే పాక్​ గడ్డపై మ్యాచ్​లు ఆడే అవకాశముంది.

మా పదవులు ఉత్తుత్తివే...

ఇటీవల ఆస్ట్రేలియాలో వసీం ఖాన్​... షికార్లు కొట్టాడానికి వెళ్లాడని పాక్​ నెటిజన్లు విమర్శలు గుప్పించారు. దానిపైనా వివరణ ఇచ్చాడు. ఫోన్లు, మెయిల్స్​ ద్వారా అన్ని పనులు జరగవని.. ముఖ్యమైన కార్యక్రమాల కోసమే ఆస్ట్రేలియా వెళ్లినట్లు చెప్పాడు. అంతేకాకుండా పాకిస్థాన్​ బోర్డులో అందరి పదవులు నామమాత్రమే అని చెప్పుకొచ్చాడు. ఆయన పదవే కాకుండా ప్రధాన కోచ్​, ఛీఫ్​ సెలక్టర్​ మిస్బా ఉల్​ హక్​ పదవి కూడా స్వయంగా ఏ నిర్ణయం తీసుకోలేడని చెప్పాడు వసీం.

Last Updated : Dec 11, 2019, 7:08 AM IST

ABOUT THE AUTHOR

...view details