తెలంగాణ

telangana

ETV Bharat / sports

బీసీసీఐ విషయంలో దిగొచ్చిన పాకిస్థాన్​ బోర్డు

ఆసియా కప్​ టీ20 టోర్నీలో భారత్​ ఆడాలని పరోక్షంగా బెదిరించిన పాక్ బోర్డు సీఈఓ వసీంఖాన్​... వెనక్కి తగ్గాడు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చుకున్నాడు. ఇరుదేశాల మధ్య మ్యాచ్​లపై ఆసియా క్రికెట్​ కౌన్సిల్​(ఏసీసీ) తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశాడు.

pakistan cricket board CEO wasim khan
బీసీసీఐ విషయంలో దిగొచ్చిన పాకిస్థాన్​ బోర్డు

By

Published : Jan 26, 2020, 10:07 PM IST

Updated : Feb 28, 2020, 1:59 AM IST

ఈ ఏడాది పాకిస్థాన్‌లో నిర్వహించే ఆసియా కప్‌లో టీమిండియా ఆడాలని బెదిరింపులకు పాల్పడ్డ పీసీబీ సీఈవో వసీం ఖాన్‌ తాజాగా మాట మార్చాడు. పాక్‌ గడ్డపై టీమిండియా... ఆసియా కప్‌ ఆడకపోతే వచ్చే ఏడాది భారత్‌లో జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించాడు. ఈ విషయంపై పెద్ద చర్చ జరగ్గా.. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నాడు వసీం.

" నేను చెప్పినవన్నీ తప్పుగా అర్థం చేసుకున్నారు. పాక్‌లో ఆసియా కప్‌ నిర్వహించడానికి ఇప్పటికీ మేం సిద్ధంగానే ఉన్నాం. అయితే భారత్‌ పాల్గొనే మ్యాచ్‌లపై ఆసియా క్రికెట్‌ కౌన్సిలే నిర్ణయం తీసుకోవాలి" అని వసీం పేర్కొన్నాడు.

వీసాల మంజూరు, భద్రతాపరమైన అంశాలపైనే తాము ఆందోళన చెందుతున్నామని, టోర్నీ నాటికి పరిస్థితులన్నీ చక్కబడతాయని వసీం ఆశాభావం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా వచ్చే ఏడాది జరిగే ఐసీసీ ఈవెంట్‌ టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరించబోమని ఆయన స్పష్టం చేశాడు.

ఇదీ చూడండి...

భారత్​లో టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరిస్తాం: పాక్​​

Last Updated : Feb 28, 2020, 1:59 AM IST

ABOUT THE AUTHOR

...view details