ఆస్ట్రేలియా మహిళల జట్టు గురువారం మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎమ్సీజీ)ను సందర్శించనుందని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. గతేడాది మహిళల టీ20 వరల్డ్‌కప్ సాధించి చరిత్ర సృష్టించిన టీమ్‌పై.. 'ది రికార్డ్' పేరుతో తీసిన డాక్యుమెంటరీ లాంచింగ్ వేడుకలు జరుపుకోవడానికే టీమ్ సభ్యులు రానున్నారని వెల్లడించింది. అయితే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కానుంది.
'ది రికార్డ్' అనేది రెండు సిరీస్‌లలో వస్తుంది. మైదానంలో వారు చూపిన అద్భుత ప్రదర్శన ఒకటి కాగా.. కప్ సాధించడానికి వారు పడిన శ్రమ ఫలితంగా ఫైనల్ వరకు ఎలా చేరారనేది ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నారు.